BRS: బీఆర్ఎస్లోనే ఉంటే పార్టీ ఆఫీస్‌కు రా.. అరికేపూడికి కౌశిక్ సవాల్!
బీఆర్ఎస్లోనే ఉంటే తెలంగాణ భవన్‌కు రావాలని అరికేపూడి గాంధీకి సవాల్ విసిరారు పాడి కౌశిక్ రెడ్డి. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు భయం పట్టుకుందన్నారు.
బీఆర్ఎస్లోనే ఉంటే తెలంగాణ భవన్‌కు రావాలని అరికేపూడి గాంధీకి సవాల్ విసిరారు పాడి కౌశిక్ రెడ్డి. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు భయం పట్టుకుందన్నారు.
జగిత్యాల జిల్లా తక్కళ్లపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లయిన 20 రోజులకే నవ వధువు భాగ్యలక్ష్మి తల్లిగారింటికి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు ఎవరు కారణం కాదని ..ఈ లోకంలో ఉండడం ఇష్టం లేదని.. చేతిపై రాసుకొని బాత్రూంకు వెళ్లి ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది.
TG: పెద్దపల్లిలో ఆక్రమ కట్టడాలపై కలెక్టర్ ఫోకస్ పెట్టారు. చెరువుల ఆక్రమణలపై కలెక్టర్ సర్వే చేయించారు. బందంపల్లిలో ఆక్రమ నిర్మాణాలను గుర్తించిన కలెక్టర్.. అధికారులకు వాటిని కూల్చివేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావును కలిసేందుకే కేటీఆర్ అమెరికా వెళ్లాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. ఎక్కడ ఉ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడిన వారికి సహకరించిన వారిని వదిలి పెట్టేది లేదన్నారు.
ఖమ్మంకు మరో భారీ ముప్పు పొంచి ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఖమ్మంతో పాటు తెలంగాణలోని 11 జిల్లాలకూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణ లో 11 జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఆ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.
కరీంనగర్ లోని కోతిరాంపూర్ లో లోన్ యాప్ వేధింపులు భరించలేక ఇద్దరు యువకులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. వారిలో సతీష్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందగా.. శ్రీనివాస్ అనే వ్యక్తి మృత్యువుతో పోరాడుతున్నాడు.
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఈరోజు అమెరికాకు వెళ్లనున్నారు. తన కుమారుడు హిమాన్షు చదువుకు సంబంధించిన విషయమై అమెరికాకు పయనమయ్యారు. ఈ క్రమంలో "అమెరికాకు వెళ్తున్నాను.. నాన్నగా బాధ్యతలు మొదలయ్యాయి" అని కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
''మళ్ళీ చెప్తున్నాం.. రాసి పెట్టుకో.. తెలంగాణకు అక్కరకురాని వాళ్ళ బొమ్మలను తొలగిస్తాం. తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్టిస్తాం'' అంటూ రేవంత్ పై నిప్పులు చెరిగారు కేటీఆర్. సోనియాగాంధీని బలిదేవత అన్న నువ్వా? రాజీవ్ గాంధీ గురించి మాట్లాడేది? అంటూ ధ్వజమెత్తారు.