Food Poison: తెలంగాణలో దారుణం.. పాఠశాలలో ఫుడ్ పాయిజన్: 61 మంది స్టూడెంట్స్

తెలంగాణలో ఫుడ్ పాయిజన్స్ కలకలం రేపాయి. కామారెడ్డి-ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో 14మంది, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలికల వసతి గృహంలో 22మంది, నారాయణపేట ధన్వాడ బాలుర పాఠశాలలో 25మంది ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు.

New Update
Kamareddy Yellareddy town government school Food poisoning

Kamareddy Yellareddy town government school Food poisoning

ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ (Food Poison)

తెలంగాణలో దారుణం చోటు చేసుకుంది. కామారెడ్డి - ఎల్లారెడ్డి పట్టణ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఇందులో దాదాపు 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే ఇలా జరగడానికి కారణం.. విద్యార్థులకు పచ్చడితో అన్నం పెట్టడమేనని తెలుస్తోంది. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగిన వెంటనే పాఠశాల సిబ్బంది వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

Also Read: మహా కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి.. యోగీ సర్కార్ సంచలన ప్రకటన

బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్

ఇలాంటిదే రాష్ట్రంలో మరో ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కలకలం సృష్టించింది. ఫుడ్ వికటించడంతో వసతి గృహంలో ఉంటున్న 22 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
కొంతమంది విద్యార్థినులు వాంతులు చేసుకున్నారు. వెంటనే గమనించిన పాఠశాల సిబ్బంది అస్వస్థతకు గురైన బాలికలను సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. ఇక ట్రీట్మెంట్ పొందుతున్న బాలికలను ఆర్డీవో, వైద్యాధికారి పరామర్శించారు. ఈ మేరకు అస్వస్థకు గురైన బాలికల ఆరోగ్యం ఇప్పుడు నిలకడగానే ఉన్నట్లు డిప్యూటీ డీఎంహెచ్ఓ పేర్కొన్నారు. . .

నారాయణపేటలో 25 మంది విద్యార్థులు

దీంతోపాటు నారాయణపేట జిల్లాలో బాలుర ఉన్నత పాఠశాలలో భోజనం వికటించి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నారాయణపేట జిల్లా ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి సుమారు 25 మంది విద్యార్థులు వాంతులు కడుపునొప్పితో ఇబ్బంది పడ్డారు. దీంతో గమనించిన పాఠశాల సిబ్బంది హుటాహుటిన వైద్యులను పాఠశాలకు పిలిపించి వైద్యం అందించారు. 
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు