/rtv/media/media_files/2025/03/20/uIfrNhDIWP4qJ5BS9QND.jpg)
brs Defected MLAs
Defector MLAs : పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం పది మంది ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసింది. ఇక ఉపఎన్నికలు ఖాయమని కేసీఆర్, కేటీఆర్ అంటున్నారు. అలా చివరిసారి ఈనెల 4వ తేదీ సుప్రీంకోర్టులో బిఆర్‌ఎస్ దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈనెల 25వ తేదిలోపు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు, స్పీకర్ కార్యాలయంతోపాటు శాసనసభ కార్యదర్మితో సహా వివరణ ఇవ్వాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. స్పీకర్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంతో నిర్లక్ష్యం వ్యవహరించడం సరికాదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మరో ప్లాన్ వేశారు. అదేమిటంటే తాము పార్టీ ఫిరాయించలేదని మర్యాదపూర్వకంగా సీఎంను కలిస్తే పార్టీ ఫిరాయించినట్లుగా మీడియాలో రాశానని వాదిస్తున్నారు.
Also Read: Sub Inspector: లీవ్ లెటర్ బయటపెట్టిన స్కామ్.. లేడీ SI ఊచలు లెక్కించింది
అలా మేము రేవంత్ రెడ్డిని కలవగానే, ఇలా మీడియాలో మేము పార్టీ మారినట్లు, బిఆర్‌ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరినట్లు వక్రీకరించారు. ఇందులో మా తప్పులేదంటూ నాలుక మడతపెట్టేశారు. ఇలా ఒక్కొక్కరుగా పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తున్నారు. సుప్రీం కోర్టులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై ఇప్పటి వరకు జరిగిన వాదనలు చూస్తే పార్టీ ఫిరాయించిన వారికి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగానే మేల్కొన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్‌ను కలసిన నాటి నుంచి బిఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటూ కాంగ్రెస్‌తో సన్నిహితంగా మెలుగుతున్న ఆ పదిమంది ఎమ్మెల్యేలు రూట్ మార్చి మేము పార్టీ ఫిరాయించలేదు, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ లు దాఖలు చేస్తున్నారు.
Also Read: USA: శాంతి ఒప్పందంపై జెల్స్ స్కీ కు ట్రంప్ కాల్..సుదీర్ఘ చర్చ
ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు అఫిడవిట్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే, అయితే సుప్రీంకోర్టులో మాత్రం పార్టీ ఫిరాయించలేదు, కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు వచ్చిన వార్తలు అవాస్తవం, బీఆర్ఎస్ పార్టీతో మంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని తాజాగా సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్‌తో తెలిపారు. శాసనసభకు మూడోసారి ఎన్నికయ్యాక, వ్యక్తిగత స్థాయిలో ముఖ్యమంత్రిని కలిశానని, పార్టీ మారలేదని, సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాకి చెందిన ఎమ్మెల్యేలు సైతం ఈ విధంగానే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది.
Also Read: అరుణాచలంలో దారుణం.. విదేశీ మహిళపై గైడ్ అత్యాచారం
సుప్రీంకోర్టు ఈ వాదనను ఎలా తీసుకుంటుందో తెలియదు కానీ.. దానం నాగేందర్ మాత్రం ఇలాంటి అఫిడవిట్ దాఖలు చేయలేరు. ఆయన కాంగ్రెస్ లో చేరడమే కాదు ఆయన ఆ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేశారు. అందుకే పార్టీ మారలేదని వాదించలేరు. దీంతో ఆయన శాసనసభ్యత్వం రద్దయ్యే అవకాశాలే ఎక్కువున్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు.ఇన్నాళ్లు వేచిచూసి ఇప్పుడు మొత్తానికే ఎమ్మెల్యే పదవి పోతుందనే భయంతోనే ఇలా స్వరం మార్చారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అఫిడవిట్లపై మార్చి 25వ తేదీ సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.