/rtv/media/media_files/2025/03/26/XjL98GBLrssMnrG2d3lC.jpg)
janagam Photograph: (janagam)
TG Crime: తెలంగాణలో క్షుద్రపూజల ఘటన కలకలం రేపుతోంది. జనగామ జిల్లా దర్ధపల్లి వాగులో గుర్తుతెలియని వ్యక్తులు కోడిని బలిచ్చి, నిమ్మకాయలు, పసుపు కుంకుమ, వెంట్రుకలతో పూజలు చేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాదు యువతి 'లో' దుస్తులతో వశీకరణకు పాల్పడటంతో మహిళలు ఉలిక్కిపడ్డారు. మహిళ ఆకారంలో ముగ్గుతో పటం వేసి అందులో క్షుద్రపూజలు నిర్వహించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బొమ్మలో నల్ల కోడిని బలిచ్చి..
ఆదివారం రాత్రి దర్ధపల్లి వాగులో ముగ్గురు వ్యక్తులు అర్ధనగ్నంగా పూజలు చేశారు. కోడిపిల్ల, పసుపు, కుంకుమ, నిమ్మకాలయు, జీడి గింజలు, మహిళల బ్రా, డ్రాయర్, తదితర వస్తువులతో క్షుద్రపూజలు నిర్వహించారు. ముగ్గుతో గీసిన బొమ్మలో నల్ల కోడిని బలిచ్చారు. అర్ధరాత్రి మంటలు పెట్టి గట్టిగా అరవడం మొదలుపెట్టారు. లేడీస్ దుస్తుల్లో పురుషుల బొమ్మలు పెట్టి మంత్రాలు చదివినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. యువతి వశీకరణ కోసం ఇలాంటి పూజలు చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. పరారిలో ఉన్న గుర్తు తెలియని వ్యక్తులకోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Also Read: Court Movie Collections: ‘కోర్టు’ కిక్కే కిక్కు.. రూ.10 కోట్ల బడ్జెట్- రూ.50 కోట్ల కలెక్షన్- USలో రచ్చ రచ్చే
ఇదిలా ఉంటే.. ఇటీవలే బెల్లంపల్లి పట్టణంలోని కన్నాలబస్తీలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. పట్టణంలోని కన్నాలబస్తీలో మారుపాక శ్రీనివాస్ ఇంటిముందు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. ఉదయం శ్రీనివాస్ ఇంటి తలుపు తెరిచి చూసేసరికి ఇంటి ముందు క్షుద్ర పూజల ముగ్గు కనిపించడంతో భయాందోళనకు గురయ్యాడు. భయంతో ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. 2024 మే నెలలో సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అమీనాబాద్‌లో ఆరోగ్యంతో పాటు గుప్తనిధుల కోసం క్షుద్ర పూజలు చేయడం కలకలం రేపింది.
ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
janagam | black-magic | telugu-news | today telugu news