హీరోయిన్ చేతికి CM రేవంత్ రెడ్డి IPL టికెట్లు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌!

IPL సందడి కేవలం గ్రౌండ్‌కే పరిమితం కాకుండా, తెలంగాణ రాజకీయాల్లోనూ వేడి పుట్టిస్తోంది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగిన SRH vs CSK మ్యాచ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. సీఎంకు కేటాయించిన టికెట్లు యాక్టర్ కుషితా కల్లపు చేతికి వెళ్లాయి.

New Update
kushitha pullapu

IPL సందడి కేవలం గ్రౌండ్‌కే పరిమితం కాకుండా, ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ వేడి పుట్టిస్తోంది. ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) vs చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మ్యాచ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ప్రముఖ నటి, ఇన్‌ఫ్లుయెన్సర్ కుషితా కల్లపు షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.

అసలు ఏం జరిగింది?

ఏప్రిల్ 18న హైదరాబాద్‌లో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను కుషితా కల్లపు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ టికెట్లపై "తెలంగాణ సీఎంకు సన్‌రైజర్స్ టీమ్ ఇచ్చిన కాంప్లిమెంటరీ టికెట్లు" అని స్పష్టంగా ప్రింట్ చేసి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం కేటాయించిన ఈ అత్యంత విలువైన వీఐపీ పాస్‌లు ఒక యంగ్ ఇన్‌ఫ్లుయెన్సర్ చేతికి ఎలా వెళ్లాయనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

నెటిజన్ల ప్రశ్నల వర్షం.. పొలిటికల్ సెటైర్లు

సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకు ఇచ్చే ప్రోటోకాల్ టికెట్లు నేరుగా సీఎం కార్యాలయానికి (CMO) చేరుతాయి. అలాంటిది సుమారు రూ.40,000 విలువ చేసే ఈ స్పెషల్ పాస్‌లను పట్టుకుని కుషితా ఫోటోలు దిగడంతో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలయ్యాయి. ప్రభుత్వ వర్గాల నుంచి ఎవరైనా ఆమెకు ఈ టికెట్లు ఇచ్చారా? లేక సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ నుంచే నేరుగా వెళ్లాయా? ముఖ్యమంత్రికి కేటాయించిన సీట్లలో ఇన్‌ఫ్లుయెన్సర్లు కూర్చోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

బీఆర్ఎస్ అటాక్.. రచ్చకెక్కిన వివాదం

ఇదే సరైన సమయంగా భావించిన BRS సోషల్ మీడియా వింగ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టింది. "ప్రజా పాలన అంటే ఇదేనా? ముఖ్యమంత్రి కోసం కేటాయించిన పాస్‌లు బయట వ్యక్తుల చేతుల్లో ఏం చేస్తున్నాయి?" అంటూ అధికార పార్టీని నిలదీస్తున్నారు. ఈ ఫోటోను షేర్ చేస్తూ ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వివాదంపై అటు ప్రభుత్వం నుంచి కానీ, ఇటు సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ నుంచి కానీ ఎలాంటి వివరణ రాలేదు. తనపై వస్తున్న విమర్శలకు నటి కుషితా కల్లపు స్పందిస్తుందా లేదా అన్నది చూడాలి. ఐపీఎల్ ఫీవర్ మధ్యలో తలెత్తిన ఈ 'టికెట్ రాజకీయం' మరిన్ని మలుపులు తిరిగేలా కనిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు