2,560 మంది స్టూడెంట్స్.. 120 మంది టీచర్స్.. తెలంగాణలో కొత్త స్కూల్స్! తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులాల్లో నాలుగు స్కూల్స్ ఉండనున్నాయి. ఒక్కో పాఠశాలలో 640 మంది విద్యార్థుల చొప్పున మొత్తం 2,560 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి పాఠశాలలో 30 మంది చొప్పున మొత్తం 120 మంది టీచర్లు పని చేస్తారు. By Seetha Ram 07 Oct 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి Integrated Gurukula Schools: రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకొచ్చింది. ఈ మేరకు విద్యావ్యవస్థపై కీలక నిర్ణయం తీసుకుంది. పేద విద్యార్థులకు ఫ్రీగా నాణ్యమైన విద్యను అందించాలని గట్టి ప్రయత్నం మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, కాంప్లెక్స్‌లు నిర్మించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లు నిర్మించేందుకు రంగం సిద్ధం చేసింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మొత్తం 20 నుంచి 25 ఎకరాల్లో నిర్మించనుంది. వీటిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల సొసైటీలకు చెందిన సుమారు నాలుగు స్కూల్స్ ఉంటాయి. అందులో ఒక్కో పాఠశాలలో 640 మంది విద్యార్థుల చొప్పున ఉంటారు. అలా నాలుగు స్కూల్స్‌లో కలిపి మొత్తం 2,560 మంది విద్యార్థులు 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకోనున్నారు. ఈ స్కూళ్లకు వేర్వేరు బ్లాక్‌లు ఉంటాయి. ప్రతి పాఠశాలలో 30 మంది చొప్పున మొత్తం 120 మంది టీచర్లు ఉంటారు. ఇంటిగ్రేటెడ్ గురుకులానికి పరిపాలన భవనం స్పెషల్‌గా ఉంటుంది. లైబ్రరీలో 5,000 బుక్స్, కంప్యూటర్ కేంద్రంలో 60 కంప్యూటర్లు ఉంటాయి. అలాగే ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోర్డులు ఉంటాయి. అంతేకాకుండా 900 మంది ఒకేసారి భోజనం చేసేలా డైనింగ్ హాలు ఉంటుంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, కాంప్లెక్స్‌ల నమూనాలను రీసెంట్‌గా ఆర్కిటెక్ నిపుణులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చూపించారు. ఇందులో భాగంగానే కొడంగల్‌లో నిర్మించే ఇంటిగ్రేటెడ్ భవనం వివరాలను వెల్లడించారు. అయితే వీటిని నిర్మించే క్రమంలో అక్కడి వాతావరణ పరిస్థితులను సైతం లెక్కలోకి తీసుకోనున్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ గురుకుల భవనాలను నిర్మించే ప్రదేశంలో దాదాపు 25 ఏళ్ల క్రితం నుంచి అక్కడి ఉష్ణోగ్రతలు, వర్షపాతం, వేడిగాలులు, చలి వంటి ఇతర వాతావరణ అంశాల్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. అంతేకాకుండా ప్రతి డార్మిటరీ గదిలో 10 బెడ్‌లు, 2 బాత్‌రూమ్‌లు ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. కొడంగల్, హూస్నాబాద్ తో పాటు.. ప్రస్తుతానికి ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ తో పాటు.. హుస్నాబాద్, హుజూర్‌నగర్, ములుగు, ఖమ్మం, చంద్రాయాణగుట్ట, కొల్లాపూర్, మంచిర్యాల, తిరుమలగిరి, అచ్చంపేట, మధిర, నల్గొండ, మంథని, వరంగల్, పాలేరు, భూపాలపల్లి, అందోలు, తుంగతుర్తి, స్టేషన్ ఘన్‌పూర్ లో నిర్వహించనున్నారు. కంప్యూటర్ సెంటర్ తో పాటు.. తరగతి గదులు, కంప్యూటర్ సెంటర్, ఆడిటోరియం ల్యాబొటరీ, లైబ్రరీ, వసతిగృహాలు, కిచెన్, డైనింగ్, క్లబ్‌లు: విద్యశాల, ఇండోర్ స్పోర్ట్స్, ఫుట్‌బాల్ గ్రౌండ్, క్రికెట్, వాలీబాల్, టెన్నిస్ కోర్టులు, బాస్కెట్‌బాల్, జిమ్ తదితర సౌకర్యాలు కల్పించనున్నారు. #telangana #cm-revanth-reddy #students మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి