TG Crime: ఇంద్రా బస్సు బోల్తా.. స్పాట్‌లో 12 మంది..

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల వద్ద తెల్లవారు జామున ఇంద్ర బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులకు తీవ్రగాయాలు కాగా.. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 12 మంది ప్రయాణికులు ఉన్నారు.

New Update
road accident khammam

road accident khammam

TG Crime: ఖమ్మం జిల్లా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొణిజర్ల మండలం తనికెళ్ల వద్ద తెల్లవారు జామున  ఇంద్ర బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులకు తీవ్రగాయాలు కాగా.. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 12 మంది ప్రయాణికులు ఉన్నారు.  ఎదురుగా వచ్చిన ఓ వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయు. హుటాహుటిన క్షతగాత్రులను ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఓ వాహనాన్ని తప్పించబోయి బోల్తా ..

ఇది కూడా చదవండి: మూర్ఛ వ్యాధి ఎందుకు వస్తుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ప్రమాదంపై సమాచారం అందుకున్న  పోలీసులు ఆర్టీసీ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిస్థితిని సత్తుపల్లి డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి పర్యవేక్షించారు. ఘటన జరగడానికి గల కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు. భారీ క్రేన్ సహాయంతో బస్సును యథాస్థితికి చేర్చి సత్తుపల్లి డిపోకు తరలించిన ఆర్టీసీ అధికారులు. హైదరాబాద్ నుంచి సత్తుపల్లి వెళుతున్న ఇంద్ర ఏసీ బస్సు సర్వీసుగా అధికారులు గుర్తించారు.

ఇది కూడా చదవండి: ఈ చట్నీ రక్త నాళాలలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది

Advertisment
Advertisment
Advertisment