/rtv/media/media_files/2025/03/12/VLakhRlQSKXebDJRAyNM.jpg)
CM Revanth Reddy
CM Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సమావేశంలో ఉబయ సభలను ఉద్ధేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. ఆయన ప్రసగిస్తున్న సమయంలో బీఆర్‌ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. పలు పథకాలు అమలు చేయకున్నా చేశామంటూ గవర్నర్‌తో చెప్పించారని ప్రసంగం మధ్యలో సేమ్ సేమ్ అంటూ అరిచారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: హైజాక్ నుంచి 104మందిని రక్షించిన పాక్ ఆర్మీ..16 మంది ఉగ్రవాదులు హతం
Also Read: రెచ్చిపోయిన పోలీసులు.. రచ్చ చేశారంటూ యువతకు గుండ్లు కొట్టించి ఊరేగింపు
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం తర్వత సీఎం ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగం తర్వాత బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తుంటే మీరేం చేస్తున్నారని నిలదీశారు. అంతా నేనే చూసుకోవాలంటే సాధ్యం కాదు. అన్నింటికీ నేనే సమాధానం చెప్పాలంటే కష్టం. కొంత బాధ్యత మీరు కూడా తీసుకోవాలి. ప్రతిపక్షాల విమర్శలకు మంత్రులు చెప్పే సమాధానాలు మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పే సమాధానాలు , ఎమ్మెల్యేలు చెప్పాలంటూ రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు.
Also Read: చైనా సైంటిస్టుల అద్భుతం.. గుండెపోటు, స్ట్రోక్స్ రాకుండా వ్యాక్సిన్!
మన పథకాలను అబాసుపాలు చేసేలా ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. మనపై బీఆర్ఎస్ బురద చల్లితే..కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పందించడం లేదు.వాళ్ళు బురద చల్లితే మనం కడుక్కోవడం కాదు. సబ్జెక్ట్ పై మాట్లాడటం నేర్చుకోండి. ఏం మాట్లాడాలో ఎమ్మెల్యేలు ప్రిపేర్ కావాలంటూ సీఎ క్లాసు పీకారు. ఇక సభ జరుగుతున్న సమయంలో సభలోనుండి బయటకు వెళ్లిన జానారెడ్డి కొడుకు ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి పై సీఎం సీరియస్ అయ్యారు. ఇంత అనుభవం ఉన్న మాలాంటివాల్లే సభలో కూర్చుంటే ఇప్పుడే ఎమ్మెల్యే లు అయిన మీరు సభ జరుగుతుంటే సభలోనుండి బయటకి వెళితే ఎలా? అంటూ మండిపడ్డారు.మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే లకు ఇది ఎంట్రెన్స్ టెస్ట్ లాంటిది. ఇప్పుడు సభలో ఉండి సబ్జెక్ట్ నేర్చుకుంటేనే రేపు భవిష్యత్తు ఉంటుంది. లేదంటే మీ అందరికీ కష్టమే. పెద్దలను చూసి కొత్త ఎమ్మెల్యేలు నేర్చుకోండి అంటూ రేవంత్ రెడ్డి గట్టిగానే మందలించారు.
Also Read: భారత్‌లోనే దలైలామా పునర్జన్మ?.. వారసుడిపై బౌద్ధగురువు కీలక ప్రకటన
‘‘మనం లిక్కర్ పాలసీ తెచ్చము.. వాళ్లు పాలసీ అనేదే లేకుండా వచ్చింది వెనక్కి వేసుకున్నారు. దీనిపై ఎందుకు మాట్లాడలేకపోతున్నారు’’ అని ప్రశ్నించారు సీఎం రేవంత్. ప్రభుత్వ విప్ లు పని తీరు మార్చుకోవాలని, కేటాయించిన సభ్యులు అన్ని విషయాల పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రభుత్వ విప్ లు అందరూ అన్ని విషయాలు మాట్లాడాలని అనుకోవద్దని, ఒక్కొక్కరు ఒక్కో విషయాన్ని ఎంపిక చేసుకోవాల్సిందిగా సూచించారు. ఫ్లోర్ కో ఆర్డినేషన్ పకడ్బందీగా చేయాలని ఎంఎల్ఏలతో సీఎం రేవంత్ అన్నారు.
ఇది కూడా చదవండి: Posani Krishna Murali: పోసానికి పెద్ద షాక్.. విడుదలకు బ్రేక్!