MLA Raja Singh : బీజేపీలోనే నాకు వెన్నుపోటుదారులు..ఎంఎల్ఏ రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీలోని కొందరు తనకు ఎప్పుడు వెన్నుపోటు పొడవాలా అనే ఆలోచనతోనే ఉన్నారని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ సర్కార్ తనపై పీడీ యాక్డ్ ప్రయోగించి జైలుకు పంపిందని అప్పుడు బీజేపీ నేతలు పోలీసులకు సపోర్ట్ గా నిలిచారన్నారు.

New Update
MLA Raja Singh :

MLA Raja Singh :

 MLA Raja Singh : ఇప్పటికీ బీజేపీలోని కొందరు తనకు ఎప్పుడు వెన్నుపోటు పొడవాలా అనే ఆలోచనతోనే ఉన్నారని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ' గత బీఆర్ఎస్ సర్కార్ తనపై పీడీ యాక్డ్ ప్రయోగించి జైలుకు పంపిందని.. ఆ సమయంలో తమ పార్టీకి చెందిన వారు కూడా తనను జైల్లో వేయాలని పోలీసులకు సూచించారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. తనను జైలుకు పంపే సమయంలో కొందరు బీజేపీ నేతలు పోలీసులకు సపోర్ట్ గా నిలిచారని వెల్లడించారు.  ఈ విషయాన్ని ఓ పోలీస్ అధికారి తనకు చెప్పినట్లు  రాజాసింగ్ వెల్లడించారు.

Also read :  TG Politics: మంత్రి కోమటిరెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భేటీ.. పార్టీ మార్పుపై కీలక ప్రకటన!

జైల్లో ఉన్న సమయంలో ఒక అన్న, కొందరు కార్యకర్తలు తన వెంట నిలిచారని రాజాసింగ్ గుర్తు చేసుకున్నారు. తాను అన్నగా భావించిన వ్యక్తి ప్రస్తుతం ఎటువైపు ఉన్నారనేది అర్థం కావడం లేదని పేర్కొన్నారు. కాగా..తాము అధికారంలోకి వచ్చాక పోలీసులపై చర్యలు తీసుకుంటామని కేటీఆర్ చెప్పడంపై రాజాసింగ్ స్పందించారు. పోలీస్ శాఖతో పెట్టుకోవద్దని కేటీఆర్ కు సూచించారు.బీఆర్ఎస్ హయాంలో  కేటీఆర్ ఆదేశాలతో పోలీసులు రేవంత్ రెడ్డి ఇంట్లోకి చొరబడి, బెడ్రూంలోకి చొచ్చుకొని వెళ్లి అరెస్ట్ చేశారని గుర్తుచేశారు. అలాంటిది అయన్ను అరెస్ట్ చేసిన వారిపై సీఎం అయ్యాక కూడా రేవంత్ ఏమీ చేయలేక పోయారని తెలిపారు. పోలీసులు లీగల్ గా పనిచేస్తారనే విషయాన్ని కేటీఆర్ మరిచిపోయినట్లున్నారని రాజాసింగ్ ఎద్దేవా చేశారు. గోషామహల్‌ నియోజకవర్గంలోని ఆకాశపురి హనుమాన్‌ దేవాలయం వద్ద రాజాసింగ్‌ మాట్లాడారు. పోలీసు శాఖతో పెట్టుకోవద్దని మాజీ మంత్రి కేటీఆర్‌(KTR)కు సూచించారు. అధికారంలోకి వచ్చాక పదవీ విరమణ చేసిన పోలీసుల మీద కూడా చర్యలు తీసుకుంటామని కేటీఆర్‌ అనడం సరికాదని అన్నారు. పోలీసులు అధికారంలో ఉన్న వారి మాట వింటారని.. అయినా న్యాయపరంగానే పనిచేస్తారని అన్నారు.

Also read :  పోస్టులు పెడితే అరెస్టులు చేస్తారా?.. AP పోలీసులకు హైకోర్టు బిగ్‌షాక్!

 

రేవంత్‌రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు మీ ఆదేశంతో పోలీసులు ఆయన ఇంట్లోకి చొరబడ్డారు. బెడ్‌రూమ్‌లోకి చొచ్చుకెళ్లి మరీ రేవంత్‌ను అరెస్టు చేసి జైలుకి పంపించారు. ఆ విషయాన్ని మరిచిపోయారా..?’ అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన్ను గతంలో అరెస్టు చేసిన వారిపై ప్రతీకార చర్యలేమీ తీసుకోలేదన్నారు.

Also read : యూఎస్‌ హెల్త్‌ ఏజెన్సీకి అధిపతిగా భారత సంతతి వ్యక్తి నియామకం!

Also read :  ''అమ్మలు హ్యాపీ బర్త్ డే'' భార్యకు ఎన్టీఆర్ విషెస్.. ఫొటోలు వైరల్

 

Advertisment
Advertisment
Advertisment