Bandi Sanjay Kumar : ఆ విషయం తట్టుకోలేకపోయా.. బండి సంజయ్ ఎమోషనల్.. ఏమన్నారంటే?

పొలిటికల్ లైఫ్‌లో లేదా బహిరంగ జీవితంలో మనం ఎన్నో పోరాటాలు చేస్తుంటాం. కానీ, ఎప్పుడైతే ఆ దాడులు మన అమ్మపైకి మళ్లుతాయో, ఆ బాధ చాలా భిన్నంగా తీవ్రంగా ఉంటుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు.

New Update
FotoJet - 2026-06-09T132447.211

Bandi Sanjay Kumar

 Bandi Sanjay Kumar : పొలిటికల్ లైఫ్‌లో లేదా బహిరంగ జీవితంలో మనం ఎన్నో పోరాటాలు చేస్తుంటాం. కానీ, ఎప్పుడైతే ఆ దాడులు మన అమ్మపైకి మళ్లుతాయో, ఆ బాధ చాలా భిన్నంగా తీవ్రంగా ఉంటుంది. గత నెల నాకు ఒక విషయాన్ని చాలా లోతుగా అర్థమయ్యేలా చేసింది. రాజకీయ పోరాటాలు, ఒత్తిళ్లు , ద్వేషం హద్దులు దాటిపోయినప్పుడు.. మన అమ్మ మన పక్కన క్షేమంగా, ఆరోగ్యంగా ఉండటం కంటే మరేదీ ఎక్కువ ముఖ్యం కాదనిపించింది. మా అమ్మ స్ట్రోక్ (పక్షవాతం) బారిన పడి బాధపడటం నన్ను లోపలి నుండి పూర్తిగా కుంగిపోయేలా చేసిందని కేంద్ర మంత్రి బండ్‌ సంజయ్‌ ఎమోషనల్‌ అయ్యారు. దీనికి సంబంధించి ఆయన ట్వీట్‌ చేస్తూ వారి అమ్మను గుర్తు చేసుకున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  పిలుపుమేరకు "ఏక్ పేడ్ మా కే నామ్" (అమ్మ పేరిట ఒక మొక్క) కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ రోజు తన ఇంట్లో మొక్కను నాటారు. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ " నేను ఈ మొక్కను నాటుతున్నప్పుడు, ఆ భావోద్వేగాలన్నీ ఒక్కసారిగా నాలో ఉప్పొంగాయి.ఇది కేవలం ఒక మొక్క మాత్రమే కాదు. నా జీవితంలో నాకు సర్వస్వం ఇచ్చిన ఆ మాతృమూర్తిపై నాకు ఉన్న ప్రేమకు, కృతజ్ఞతకు ,ఆమె శక్తికి ఇది ఒక నిదర్శనం. అంటూ బావోద్వేగానికి గురయ్యారు.

మా అమ్మ విలువను నేను ఎప్పటికీ మాటల్లో పూర్తిగా వర్ణించలేను. ప్రతి అటుపోటును ఎదుర్కొంటూ ఆమె చూపించిన ప్రేమ, త్యాగం, సహనం లాగే.. ఈ మొక్క కూడా అంతే బలంగా, అందంగా, శాశ్వతంగా ఎదగాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ అద్భుతమైన కార్యక్రమం వెనుక ఉన్న  ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఆలోచన, ప్రతి భారతీయుడి హృదయాన్ని తాకే ఒక అందమైన భావోద్వేగాన్ని కలిగి ఉంటుంది అని బండి సంజయ్‌ ట్వీట్‌ చేశారు.

Advertisment
తాజా కథనాలు