Revanth Reddy : రెండోసారి కూడా నేనే ముఖ్యమంత్రిని.. చిట్‌చాట్‌లో CM రేవంత్ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని.. రెండోసారి కూడా తానే ముఖ్యమంత్రిని అవుతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనమండలి వాయిదా పడిన తర్వాత శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు.

New Update
Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy : రెండో సారి కూడా తానే ముఖ్యమంత్రి అవుతానని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శాసనమండలి వాయిదా పడిన తర్వాత శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. రాష్ట్రంలో పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని.. రెండోసారి కూడా తానే ముఖ్యమంత్రిని అవుతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు.‘‘మొదటి సారి బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకతతో ఓటు వేశారు. రెండో సారి మా మీద నమ్మకంతో ప్రజలు ఓటేస్తారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తా. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసి ప్రజల వద్దకు వెళ్తాం. సంక్షేమ పథకాల లబ్ధిదారులే మా ఓటర్లు. నేను పనిని నమ్ముకొని ముందుకు వెళ్తున్నా’’ అని సీఎం అన్నారు.

Also Read: ఓలా, ఉబర్ డ్రైవర్ల ముసుగులో...బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాలో వెలుగులోకి సంచలన విషయాలు...

Also Read: డీలిమిటేషన్‌ వల్ల సీట్లు తగ్గుతాయా ? కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

 ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకుంటామని మరోసారి స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే తమ ఓటర్లు అని.. మా పనిమీద నమ్మకంతో ధైర్యంగా ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. స్టేచర్ కాదు.. స్టేట్ ఫ్యూచర్ తనకు ముఖ్యమని వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం కచ్చితంగా కోటి మంది మహిళలకు లబ్ధి చేకూరుస్తా అని మరోసారి స్పష్టం చేశారు. వాళ్లు ఇప్పుడు మౌనంగా ఉన్నా.. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కే ఓటేస్తారని అన్నారు.  25 లక్షల పైచీలుకు మందికి రుణమాఫీ జరిగిందని, ఒక్క కుటుంబంలో నలుగురు ఉన్న రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య కోటి అని ఆయన అన్నారు.గతంలో ఎన్నికలకు ముందు నేనేం చెప్పానో అదే జరిగింది.. ఫ్యూచర్‌లో కూడా నేను చెప్పబోయేదే జరుగుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read: హోలీ రోజు ఆకతాయిలు చేసిన పనికి.. 8 మంది అమ్మాయిలు హాస్పిటల్ పాలైయ్యారు

ఇది కూడా చూడండి: దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు...

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

KTR : మోసగాడిని నమ్మినందుకు తెలంగాణ ఆగం అయింది. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు

New Update
BRS meeting

BRS meeting

KTR : తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు..రేవంత్ రెడ్డి చెప్పిన అవాస్తవ వాగ్దానాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసంబద్ధ హామీల వలన ప్రజల జీవితాలు సంక్షోభంలో పడినట్టు పేర్కొన్నారు. ‘‘ఒక్కసారి మోసపోతే అది మోసగాడి తప్పు, కానీ పదేపదే మోసపోతే అది మన తప్పవుతుంది. కాబట్టి ఈసారి ఎలాంటి ఎన్నిక వచ్చినా కాంగ్రెస్‌ను తిప్పికొట్టాలి’’ అని ప్రజలను హెచ్చరించారు.

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

 కాంగ్రెస్ ను తిరస్కరించండి


‘ఒకే తప్పును మళ్లీ చేయొద్దు. GHMCతో పాటు రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తిరస్కరించండి’’ అంటూ కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం మొత్తం దారుణంగా వెనుకబడుతున్నా, ఒక్క రేవంత్ రెడ్డీయే ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ‘‘రేవంత్ పాలన వలన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలే అసంతృప్తిగా ఉన్నారు. ఇక ప్రజల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఇది వాళ్ల విఫల పాలన ఫలితమే’’ అని అన్నారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ప్రజల మధ్య తిరుగుతూ సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తారని కేటీఆర్ ప్రశంసించారు. ‘‘డంపింగ్ యార్డ్ వంటి కీలక సమస్యలపై పోరాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంచి నాయకుడిని గెలిపిస్తే, మంచి మార్పు సాధ్యమవుతుందని ఆయన నిరూపించారన్నారు.

Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..

 నలుగురికి భరోసానిచ్చేది బీఆర్ఎస్


ఎన్నిక ఏదైనా, సందర్భం ఏదైనా ఈసారి ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఆత్మ, తెలంగాణ స్వభిమానం కాపాడాలంటే, భరోసా నలుగురికీ కలిగించగల పార్టీ ఒక్కటే ఉంది అది భారత రాష్ట్ర సమితి అని పేర్కొన్నారు.సిల్వర్ జూబ్లీ ఉత్సవాల విజయవంతానికి కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘‘ఈ నెల 27న పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం. ఒక పార్టీగా 25 సంవత్సరాల ప్రయాణం ఎలాంటి మైలురాయో ప్రతి కార్యకర్తకు అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో రెండవ ఘనత సాధించిన పార్టీగా మనకు గర్వం’’ అని కేటీఆర్ తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు.

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

Advertisment
Advertisment
Advertisment