Secunderabad మిలిటరీ ఏరియాలో చొరబాటు.. నలుగురు అరెస్ట్
సికింద్రాబాద్ మిలిటరీ ఏరియాలో చొరబాటుపై విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఈ కేసులో నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేయగా... ఇందులో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులున్నారు.
సికింద్రాబాద్ మిలిటరీ ఏరియాలో చొరబాటుపై విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఈ కేసులో నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేయగా... ఇందులో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులున్నారు.
హైదరాబాద్ లో ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయడం వల్ల యావరేజ్స్పీడ్ పెరిగిందని నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన నగరంలో అమలు చేస్తున్న ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్‌ను వివరించారు.
హైదరాబాద్‌లో ఓ కారు డ్రైవర్ వెనక్కి చూసుకోకుండా డోర్‌ను తెరిచాడు. బైక్‌పై వెళ్తున్న జమీర్ కుటుంబానికి ఆ డోర్‌కు తగిలి వాహనం అదుపుతప్పి పడిపోయింది. దీంతో ఫాతిమా అనే మహిళ ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమార్తె ప్రాణాలతో బయటపడింది.
ఆన్లైన్లో చిన్నారుల పోర్న్ వీడియోలు చూసి, ఇతరులకు పంపుతున్న 15 మందిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, వరంగల్, కరీంనగర్, జగద్గిరిగుట్ట, జగిత్యాల ప్రాంతాల్లో నిందితులను అరెస్టు చేశారు. ఇప్పటివరకు 294 కేసులు నమోదయ్యాయి.
పెళ్లయిన 6 నెలలకే ఓ మహిళా సాఫ్ట్వేర్ తనువు చాలించింది. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామ, మరిది వేధింపులు తాళలేక కేబిల్ బ్రిడ్జ్ మీద నుంచి దుర్గంచెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
కొడాలి నాని కోల్‌కతా నుంచి కొలంబోకు పారిపోతుండగా పోలీసులు అరెస్ట్ చేశారని వార్తలు వచ్చాయి. ఈ మేరకు కొడాలి నాని క్లారిటీ ఇచ్చారు. తాను ఎక్కడికి పారిపోలేదన్న నాని తనకు పాన్, ఆదార్, డ్రైవింగ్ లైసెన్స్‌లు తప్ప పాస్‌పోర్టు లేదని స్పష్టం చేశారు.
హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ మెయిల్ ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆగంతకుల మెయిల్‌తో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్వ్కాడ్‌తో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఇప్పట్లో ఉప ఎన్నిక ఉండకపోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు నోటిఫికేషన్ వచ్చిందన్నారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక ఆలస్యం కావొచ్చన్నారు.
కన్నప్ప మూవీపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. సెన్సార్ స్క్రూటినీ జరగక ముందే విడుదల తేదీ ఎలా ప్రకటిస్తారని కోర్టు ప్రశ్నించింది. ఈ సినిమా సనాతన ధర్మాన్ని, హిందూ దేవతలను, బ్రాహ్మణులను కించపరిచే విధంగా నిర్మించబడిందని రిట్ పిటిషన్ దాఖలు చేశారు.