Hyderabad : హైదరాబాద్లో పట్టపగలే దారుణం .. రన్నింగ్ చేస్తుండగా యువతికి వేధింపులు.. వీడియో వైరల్ !

హైదరాబాద్ లో తాజాగా చోటుచేసుకున్న ఓ సంఘటన నగరవాసులను, ముఖ్యంగా మహిళలను ఉలిక్కిపడేలా చేసింది. నానక్‌రామ్‌గూడ సమీపంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సోలార్ సైకిల్ ట్రాక్‌పై ఓ మహిళా రన్నర్‌కు ఎదురైన వేధింపుల ఘటన ఇప్పుడు నగరాన్ని కుదిపేస్తోంది.

New Update
video

హైదరాబాద్ లో తాజాగా చోటుచేసుకున్న ఓ సంఘటన నగరవాసులను, ముఖ్యంగా మహిళలను ఉలిక్కిపడేలా చేసింది. నానక్‌రామ్‌గూడ సమీపంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సోలార్ సైకిల్ ట్రాక్‌పై ఓ మహిళా రన్నర్‌కు ఎదురైన వేధింపుల ఘటన ఇప్పుడు నగరాన్ని కుదిపేస్తోంది. ఉదయం ప్రశాంతంగా రన్నింగ్ చేసుకునేందుకు వెళ్లిన ఆ మహిళను ఓ వ్యక్తి అడ్డగించి, అసభ్యంగా ప్రవర్తించాడు. నగరంలో షీ టీమ్స్, సిసిటివీ కెమెరాలు వంటి పటిష్టమైన నిఘా వ్యవస్థ ఉందని నమ్మే మహిళలకు, ఈ ఉదంతం ఒక హెచ్చరికలా మారింది.

ఇన్ స్టాగ్రామ్ లో వీడియో

ఈ ఘటనపై సదరు మహిళ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. "హైదరాబాద్ అంటే మహిళలకు అత్యంత సురక్షితమైన నగరం అని నేను ఎప్పుడూ గర్వంగా చెప్పుకునేదాన్ని. కానీ, ఇవాళ నాకు ఎదురైన అనుభవం తర్వాత అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అనే అనుమానం కలుగుతోంది" అంటూ ప్రశ్నించింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే కాకుండా, ఇలాంటి స్పెషల్ ట్రాక్‌లపై కూడా ఒంటరిగా వెళ్లే మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేసింది. 

ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాంటి ఆకతాయిల వల్ల మహిళలు బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని మండిపడుతున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సైకిల్ ట్రాక్‌ వద్ద నిఘా పెంచాలని, ఆ దుండగుడిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.ప్రస్తుతం ఆమె చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Advertisment
తాజా కథనాలు