Hyderabad : యుద్ధం ఎఫెక్ట్.. పెట్రోల్ కోసం జనం పరుగులు.. కిలోమీటర్ల మేర క్యూ!

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం సెగ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా హైదరాబాద్‌కు గట్టిగానే తగిలింది. పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందన్న భయంతో వాహనదారులు బంకుల

New Update
auto

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం సెగ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా హైదరాబాద్‌కు గట్టిగానే తగిలింది. పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందన్న భయంతో వాహనదారులు బంకుల దగ్గరకు పోటెత్తడంతో నగరంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. పెట్రోల్ నిండుకుందన్న వార్తలతో జనం క్యూ కట్టడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి.

 స్టాక్ అయిపోయిందని బోర్డులు

హైదరాబాద్‌లోని ఉప్పల్, మల్లాపూర్, ఘట్‌కేసర్, అత్తాపూర్ వంటి ప్రధాన ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల దగ్గర పరిస్థితి ఆందోళనకరంగా మారింది. చాలా చోట్ల స్టాక్ అయిపోయిందని బోర్డులు పెట్టడంతో వాహనదారులు ఒక బంకు నుంచి మరో బంకుకు పరుగులు తీస్తున్నారు. ఆటోలు, బైకులు కిలోమీటర్ల మేర క్యూలో నిలబడటంతో సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం పెట్రోల్ మాత్రమే కాకుండా, సిఎన్‌జి కోసం కూడా వాహనాలు భారీగా వేచి చూడాల్సి వస్తోంది.

మరోవైపు, ఈ పరిస్థితిపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ లేదా ఎల్‌పీజీ గ్యాస్ కొరత ఏమీ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. చమురు శుద్ధి కర్మాగారాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని, అన్ని జిల్లాలకు రోజూవారీ సరఫరా సక్రమంగానే సాగుతోందని అధికారులు వెల్లడించారు. జనం అనవసరంగా భయపడి ఒకేసారి బంకుల మీద పడొద్దని విజ్ఞప్తి చేశారు.

వదంతులను నమ్మి ఆందోళన చెందవద్దని, ఏదైనా సమాచారం కావాలన్నా లేదా ఫిర్యాదు చేయాలన్నా వెంటనే 1967 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం నెలకొన్న ఈ రద్దీ కేవలం భయం వల్ల ఏర్పడిందే తప్ప, స్టాక్ లేక కాదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే నగరంలో ఇంధన నిల్వలు నిండుకున్నాయనేది కేవలం అపోహ మాత్రమేనని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని  పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు. 

Advertisment
తాజా కథనాలు