తెలంగాణ క్రీడాభివృద్ధికి సహకరించండి.. కేంద్ర మంత్రికి విజ్ఞప్తి

తెలంగాణలో క్రీడాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ ఛైర్మన్ కె.శివసేన రెడ్డి.. కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియాను కోరారు. రాష్ట్రంలో స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

author-image
By B Aravind
New Update
Mansuk Mandaviya

తెలంగాణలో క్రీడాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ ఛైర్మన్ కె.శివసేన రెడ్డి.. కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియాను కోరారు. శుక్రవారం పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రికి ఆయన వినతి పత్రం సమర్పించారు. తెలంగాణకు రాష్ట్రానికి క్రీడా చరిత్ర ఉందని.. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో రాణించిన అనేక మంది తెలంగాణ నుంచి వచ్చినవారే అనే లేఖలో పేర్కొన్నారు.  

Also Read: అద్దె ఇంట్లో వ్యభిచారం.. దంపతులు అరెస్ట్!

స్విమ్మింగ్ పూల్స్, సింథటిక్‌ అథ్లెటిక్ ట్రాక్ షూటింగ్, టెన్నిస్ కాంప్లెక్స్, ఫుట్‌బాల్ మైదనాలు, వాటర్ స్పోర్ట్స్‌ క్రీడా సౌకర్యాలు గచ్చిబౌలి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్, సరూర్‌నగర్‌ ఇండోర్ స్టేడియం, ఎల్‌బీ స్టేడియం, జింఖానా గ్రౌండ్స్‌ ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్‌ నగరం అంతర్జాతీయ స్థాయిలో పోటీల నిర్వహణకు అత్యంత సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో జరిగే ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్‌వెల్త్ గేమ్స్‌తో పాటు పలు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్ నిర్వహించేందుకు తెలంగాణకు అవకాశం ఇవ్వాలని లేఖలో కోరారు. 

అలాగే రాష్ట్రంలో యువ క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని.. ఇందుకోసం కేంద్రం ఆర్థిక సాయం అందించాలన్నారు. అలాగే క్రీడా సౌకర్యాల అభివృద్ధికి, మౌళిక సదుపాయాల మెరుగుదల కోసం ఖేలో ఇండియా పథకం కింద నిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణను స్పోర్ట్స్‌ హబ్‌గా మార్చాలని ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మద్ధతు తెలపాలని కోరారు. 

Also Read: జెఎన్‌టీయూహెచ్‌లో మారనున్న సిలబస్‌.. వచ్చే విద్యా సంవత్సరం అమలు

Advertisment
Advertisment
తాజా కథనాలు