/rtv/media/media_files/2025/04/03/XfYys1PQXSRRdcNHGcZy.jpeg)
SC on HCU land Photograph: (SC on HCU land)
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూవివాదంలో సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది. HCU భూవివాదంపై దాఖలైన పిటిషన్‌ను గురువారం సుప్రీం కోర్టులో విచారించింది. ఇది చాలా సీరియస్ ఇష్యూ అని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు చురకలు అంటించింది. జస్టిస్ గవాయ్ రాష్ట్ర ప్రభుత్వం, సీఎస్ లపై ప్రశ్నల వర్షం కురింపించారు. 400 వందల ఎకరాల భూవివాదంపై నెల రోజుల్లో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సర్వోన్నత న్యాయస్ధానం ఆదేశించింది. ఆ కమిటీ ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని కోరింది. నెమళ్లు, జింకలు, పక్షులకు ఆవాసమైన అటవి ప్రాంతంలో చెట్లను ఎందుకు తొలగించారని ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు నిలదీసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు గురువారం మధ్యాహ్నం తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ మధ్యంతర నివేదికను పంపారు.
#BREAKING Issue of mass felling of trees at Kancha Gachibowli (Telangana) reaches #SupremeCourt
— Live Law (@LiveLawIndia) April 3, 2025
Registrar (Judicial) of HC directed to visit site and submit interim report TODAY by 3.30 PM
Chief Secretary of State directed to ensure no felling takes place till further orders pic.twitter.com/0R0Dg48Ncl
Also read: BIG BREAKING: HCU భూముల వ్యవహారం.. రేవంత్ సర్కార్‌కు హైకోర్టు బిగ్ షాక్
100 ఎకరాల్లో అడవిని నాశనం చేశారని సుప్రీం కోర్టుకు రిపోర్ట్ అందింది. చెట్ల నరికివేతను సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టామని న్యాయమూర్తి తెలిపారు. 400 ఎకరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సుప్రీం కోర్టు ప్రతివాదిగా చేర్చింది. ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణం జరిగినా.. పూర్తి బాధ్యత సీఎస్‌దే అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అంత అర్జెంట్‌గా డిఫారెస్టేషన్ పనులు మొదలుపెట్టాల్సిన అవసరమేంటని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. ఒకవేళ ఇది అటవీ ప్రాంతం కాకపోయినా, చెట్లు కొట్టే ముందు సీఈసీ అనుమతి తీసుకున్నారా అని సుప్రీం కోర్టు నిలదీసింది. ఒక్క రోజులో వంద ఎకరాల్లో చెట్లు కొట్టేయడం మామూలు విషయం కాదని తెలిపింది. తమ ప్రశ్నలకు సీఎస్ సమాధానం చెప్పాలని సుప్రీం ఆదేశించింది. అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీం కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది.
Also Read: అత్యంత దయనీయంగా శ్రీతేజ్ పరిస్థితి.. కనీసం కుటుంబసభ్యులను కూడా గుర్తుపట్టలేని దుస్థితి