/rtv/media/media_files/2025/01/22/yQeT6HkbNqAkCuWMMY5T.webp)
Shamshabad Airport
Shamshabad Airport : జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశం యావత్తు వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు.
ఇది కూడా చదవండి :ఫోర్త్ ఫ్లోర్ నుంచి ఇద్దరు పిల్లల్ని విసిరేసి చంపిన తల్లి
గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిఘా వర్గాలు రెడ్ అలెర్ట్ ప్రకటించాయి. కాగా నేటి నుంచి ఈ నెల 30 వరకు ఎయిర్ పోర్ట్లో రెడ్ అలెర్ట్ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.
ఎయిర్ పోర్టులో రెడ్ అలర్ట్ ప్రకటించినందున ఈనెల 30 వరకు ఎయిర్ పోర్ట్కు సందర్శకులు ఎవరు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. గణతంత్ర వేడుకల సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ఆస్కారం ఉండటంతో పాటు అల్లరిమూకలు చెలరేగే ప్రమాదం పొంచి ఉందన్న నిఘావర్గాల ముందస్తు హెచ్చరికతో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా సీఐఎస్ఎఫ్ భద్రతా అధికారులు ఎయిర్ పోర్టులో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇది కూడా చదవండి :బస్సు కోసం అడిగితే ఎత్తుకెళ్ళి రేప్ చేశారు..బెంగళూరు టెర్రర్
ఎయిర్ పోర్టుకు వెళ్లే మార్గాలను తమ ఆధీనంలోకి తీసుకోవడంతో పాటు ఎయిర్ పోర్ట్ ప్రధాన దారిలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపడుతున్నారు. ప్రయాణీకులతో ఎయిర్ పోర్ట్‌కు వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. అన్ని రకాల వాహనాలను ఆపి తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. కాగా ప్రయాణీకులకు వీడ్కొలు పలుకేందుకు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే సందర్శకులకు అధికారులు అనుమతి నిరాకరించారు. అనుమానితులు, అనుమానిత వస్తువులు, అనుమానిత వాహనాలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.