ఈనెల 8వ తేదీన మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా వ్యాధిగ్రస్తుల కోసం ఇచ్చే ప్రసిద్ధ చేప ప్రసాదం పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్, సహచర మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, షాట్ చైర్మన్ శివసేనారెడ్డితో పాటు పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రులు గ్రౌండ్ అంతా తిరిగి భక్తుల కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లను, క్యూ లైన్లను నిశితంగా పరిశీలించారు.
ఈసారి చేప ప్రసాదం పంపిణీ ప్రక్రియ 8వ తేదీ రాత్రి 9 గంటలకే ప్రారంభం అవుతుండటంతో, దేశం నలుమూలల నుండి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా క్యూలైన్లలో తొక్కిసలాట లాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు చాలా అప్రమత్తంగా ఉండాలని, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే పంపిణీ సమయంలో కరెంట్ పోకుండా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రస్తుతం ఎండలు, ఉక్కపోత ఎక్కువగా ఉన్నందున భక్తులు నిలబడే క్యూ లైన్ల వెంబడి భారీ ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
వాట్సప్ గ్రూప్ క్రియేట్
భక్తుల రక్షణ, సౌకర్యాల కోసం అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ పంచుకోవాలని, ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసే కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని మానిటరింగ్ చేయాలని చెప్పారు. నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా ముందే ప్లాన్ చేయాలన్నారు. ఎమర్జెన్సీ కోసం అంబులెన్సులను అందుబాటులో ఉంచడంతో పాటు, అవసరమైన మందులతో మెడికల్ క్యాంపులు పెట్టాలన్నారు. క్యూలైన్ల మధ్యలోనే అత్యవసర చికిత్స అందించేలా సీపీఆర్ బృందాలను కూడా సిద్ధం చేయాలని ఆదేశించారు.
మైకుల ద్వారా భక్తులకు సమాచారం స్పష్టంగా వినబడేలా ఆడియో సిస్టమ్ బాగుండాలని, అగ్నిప్రమాదాలు జరగకుండా ఫైర్ ఇంజన్ వాహనాలను అందుబాటులో ఉంచాలని మంత్రి చెప్పారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ రంగంలోకి దించాలని, జేబుదొంగతనాలు జరగకుండా భక్తులను మైకుల ద్వారా అలర్ట్ చేయాలని పోలీసులకు సూచించారు. గ్రౌండ్ అంతా సీసీ కెమెరాల నిరంతర నిఘాలో ఉండాలన్నారు. భక్తులకు తాగునీటి కొరత రాకుండా చూడాలని, ప్రతి ఏటా లాగే ఈసారి కూడా స్వచ్ఛంద సంస్థలు భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
Hyderabad: చేప ప్రసాదం.. మంత్రి పొన్నం కీలక ఆదేశాలు!
ఈనెల 8వ తేదీన మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా వ్యాధిగ్రస్తుల కోసం ఇచ్చే ప్రసిద్ధ చేప ప్రసాదం పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను మంత్రి పొన్నం పరిశీలించారు.