/rtv/media/media_files/2026/04/10/women-2026-04-10-12-45-24.jpg)
సభ్య సమాజం తలదించుకునేలా మేడ్చల్ జిల్లాలో ఒక దారుణమైన ఘటన చోటుచేసుకుంది. 'రాజు వెడ్స్ రాంబాయి' అనే సినిమా తరహాలో ఓ ఉన్మాది చేసిన పనికి నిండు ప్రాణం బలైపోయింది. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందన్న కోపంతో ఒక యువతికి బలవంతంగా ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించి, ఆమె మరణానికి కారణమయ్యాడు ఒక కిరాతకుడు.
పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 11వ తేదీన ఈ ఘోరం జరిగింది. నిందితుడు ఒక యువతిని పెళ్లి చేసుకోవాలని వేధించగా, ఆమె నిరాకరించింది. దీంతో కక్ష పెంచుకున్న ఆ యువకుడు, బాధితురాలిని బంధించి ఆమెకు బలవంతంగా హెచ్ఐవి (ఎయిడ్స్) సోకిన రక్తాన్ని శరీరంలోకి ఎక్కించాడు. ఈ చర్యతో ఆ యువతి శారీరకంగానే కాకుండా మానసికగా తీవ్ర వేదనకు గురైంది.
ఇంట్లో ఉరి వేసుకుని
ప్రాణాంతక వ్యాధి సోకిందన్న భయం ఆ యువతిని కుంగదీశాయి. గత కొన్ని రోజులుగా మానసిక క్షోభను అనుభవిస్తున్న బాధితురాలు, చివరకు తన ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు వదిలింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేవలం పెళ్లికి ఒప్పుకోలేదన్న చిన్న కారణంతో ఇంతటి అమానుషానికి ఒడిగట్టిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోచారం పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒక యువతి ప్రాణం పోవడానికి కారణమైన ఆ కిరాతకుడికి ఉరిశిక్ష పడాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Follow Us