/rtv/media/media_files/2025/03/29/wLVnmuOzyYgsgxWJGzg7.jpg)
Hyderabad metro timings
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పారు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి. మెట్రో సమయం పొడిగించినట్లుగా వెల్లడించారు. ఇప్పటివరకు రాత్రి 11 గంటల వరకు మాత్రమే ఉండగా.. ఇకపై రాత్రి 11.45 గంటల వరకు మెట్రో నడుస్తుందన్నారు. ఈ టైమింగ్స్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుందన్నారు. అయితే సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఈ టైమింగ్స్ అమల్లో ఉంటాయని వెల్లడించారు. టెర్మినల్ స్టేషన్‌ల నుంచి ఆదివారాల్లో మొదటి రైలు ఉదయం 7 గంటలకు ప్రారంభం అవుతుందని చెప్పుకొచ్చారు.
విద్యార్థులు ఆఫర్
అలాగే, హైదరాబాద్ మెట్రోను విద్యార్థులు ఎక్కువగా వినియోగించుకోవడం వలన దీనిని పరిగణలోకి తీసుకుని 20 ట్రిప్పులకు చెల్లించి 30 ట్రిప్పులను విద్యార్థులు పొందే ఆఫర్ ను మరో సంవత్సరం పాటు పొడిగించింది మెట్రో. ఇది 2026 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది. 2024ఏప్రిల్ లో ప్రారంభమైన సూపర్ సేవర్ హాలిడే ఆఫర్ (SSO), ఆఫ్-పీక్ తగ్గింపు ఆఫర్ 2025 మార్చి31 న ముగుస్తుంది.
హెచ్‌ఎంఆర్‌ఎల్, ఎండీ శ్రీ ఎన్‌విఎస్ రెడ్డి మాట్లాడుతూ "హైదరాబాద్ మెట్రో రైలు, కేవలం మౌలిక సదుపాయాల ప్రాజెక్టు మాత్రమే కాదు-. ఇది పట్టణ పరివర్తన , సమాజ అభివృద్ధికి ఉత్ప్రేరకం. మెట్రో ఫెస్ట్, మెట్రో మెడ్లీ, ఆర్ట్ ఫెస్ట్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలను మా రవాణా వ్యవస్థలో చేర్చడం ద్వారా, ప్రజా రవాణా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించడంలో మేము కీలక పాత్ర పోషిస్తున్నాము" అని అన్నారు.
Also read : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐపీఎస్ అధికారి దుర్మరణం!
Also read : చావుకు వెళ్తే చచ్చేంత పనైంది.. శవాన్ని నడిరోడ్డుపైనే వదిలేసి పరుగో పరుగు!