/rtv/media/media_files/2025/01/29/IFz0HGHYU6r8NaZCZvP6.jpg)
Hyderabad metro
Hyderabad Metro: హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైలు సేవలు ప్రజలకు ముఖ్యమైన రవాణా మార్గంగా మారాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం మెట్రో రైళ్లల్లో ప్రయాణించే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఉద్యోగాలకు, విద్యాసంస్థలకు వెళ్లేవారు తమ గమ్యాలను త్వరగా చేరుకోవడానికి మెట్రో సేవలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
Also Read: Daaku Maharaaj: దబిడి దిబిడే.. ఓటీటీలోకి బాలయ్య డాకు మహారాజ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆగిన మెట్రో సేవలు
అయితే ఈరోజు ఉదయం ఒక్కసారిగా మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణాలతో దాదాపు రెండు గంటల పాటు రైళ్లు నిలిచిపోయాయి. అమీర్‌పేట-హైటెక్‌సిటీ, నాగోల్-సికింద్రాబాద్, మియాపూర్-అమీర్‌పేట రూట్లోలో నడిచే మెట్రోలు ఎక్కడిక్కడే ఆగిపోయాయి. దీంతో ఇటు రైలు లోపల ఉన్న ప్రయాణికులు, అటు స్టేషన్లలో రైలు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఆఫీసులకు, కాలేజీలకు వెళ్లే సమయంలో రైళ్లు ఎంతకీ రాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు.
#Hyderabad | నగరంలో మెట్రోరైలు సేవలకు మరోసారి అంతరాయం..
— DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) January 29, 2025
♦️ఉదయం అమీర్పేట్- హైటెక్ సిటీ మార్గంలో మెట్రో రైళ్లు గంటకుపైగా ఆలస్యం
♦️సిగ్నలింగ్ వ్యవస్థలోని సాంకేతిక సమస్యల కారణంగా రైళ్లు ఆలస్యం అవుతున్నాయని మెట్రో రైలు అధికారులు ప్రకటించారు.@ltmhyd pic.twitter.com/Tma1lfHGhO
Also Read: వాంతికి రావడంతో బస్సులో నుంచి తల బయటకు.. కట్ చేస్తే రోడ్డుపై తల, చేయి!
సాంకేతిక లోపం
సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయిన మెట్రో సేవలు .. త్వరలోనే యాథావిదిగా తిరుగుతాయని అధికారులు పేర్కొన్నారు. ఉదయం ఆరు గంటల నుంచి 8గంటల వరకు బాగానే నడిచిన రైళ్లు.. 9 గంటల నుంచే టెక్నీకల్ ఇస్యూ వల్ల ఎక్కడిక్కడ నిలిచిపోయాయని తెలిపారు. ఈ తరుణంలో అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. దీంతో కొత్త ప్రయాణికులు లోపలికి రాకుండా గేట్లు మూసివేస్తున్నారు సిబ్బంది.
ఇది కూడా చదవండి: Johny master : జానీ మాస్టర్ పై కేసు.. తొలిసారి నోరు విప్పిన కొరియోగ్రాఫర్.. సంచలన ఇంటర్వ్యూ!