/rtv/media/media_files/2025/03/15/aMqfggfiqtzIA1O3P8dW.jpg)
VC Sajjanar serious warning to YouTuber Harsha Sai after sharing video Photograph: (VC Sajjanar serious warning to YouTuber Harsha Sai after sharing video)
యూట్యూబర్ హర్షసాయికి బిగ్ షాక్ తగిలింది. అతనిపై పోలీసు కేసు నమోదు అయింది. హర్షసాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడంటూ కేసు నమోదు చేసినట్లుగా సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని ఎక్స్ వేదికగాషేర్ చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. కాగా ఇప్పటికే సజ్జనార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోకల్ బాయ్ నానిని పోలీసులు అరెస్ట్ చేశారు. బయ్యా సన్నీ యాదవ్‌పైనా కూడా కేసు నమోదు అయింది. అయితే తాను ఎవర్నీ టార్గెట్ చేయడం లేదని సజ్జనార్ స్పష్టం చేశారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నవాళ్లను మాత్రం వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు సజ్జనార్.
బెట్టింగ్ యాప్ లతో ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేసి కోట్లలో సంపాదించి.. వేలల్లో పంచుతూ సంఘ సేవ చేస్తున్నట్లు పోజులు కొడుతున్న ఇలాంటి వాళ్లనా మీరు ఫాలో అవుతుంది.
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 16, 2025
వీరి స్వార్థం వల్లే బెట్టింగ్ సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. భారత ఆర్ధిక వ్యవస్థను కూడా దెబ్బ… https://t.co/hUwPhOtPjP
Also read : ఆమెను చేసుకుంటా.. నిన్ను ఉంచుకుంటా.. ప్రియుడి మోసానికి ప్రియురాలి ట్విస్ట్!
హర్షసాయిని అన్‌ఫాలో చేయండి
ఫాలోవర్స్ అందరూ హర్షసాయి లాంటి వారిని అన్‌ఫాలో చేయాలని సజ్జనార్ పిలుపునిచ్చారు. ‘‘చేస్తున్నదే తప్పు.. అదేదో సంఘసేవ చేస్తున్నట్టు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నాడో చూడండి. తాను బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారని ఈయన చేస్తున్నాడట. బుద్దుందా అసలు! ఎంతో మంది అమాయకుల ప్రాణాలు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బలైతుంటే కనీసం పశ్చాత్తాపం లేదు. వీళ్లకు డబ్బే ముఖ్యం, డబ్బే సర్వస్వం.. ఎవరూ ఎక్కడ పోయినా, సమాజం, బంధాలు, బంధుత్వాలు చిన్నాభిన్నమైన సంబంధం లేదు. ఈయనకు 100 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ఆఫర్ చేశారట. అంతగనం డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించండి. మీ ఫాలోయింగ్ ని మార్కెట్‌లో పెట్టి కోట్లకు కోట్లు సంపాదిస్తున్న ఇలాంటి వాళ్లనా.. మీరు ఫాలో అవుతోంది. వెంటనే ఈ బెట్టింగ్ ఇన్‌ప్లూయెన్సర్లను అన్‌ఫాలో చేయండి. వారి అకౌంట్లను రిపోర్ట్ కొట్టండి. ఆన్‌లైన్ బెట్టింగ్ భూతాన్ని అంతమొందించడంలో మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి.’’ అని ఆయన తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.