Hyderabad: ప్రాణం తీస్తున్న జంతువులు.. తెలంగాణలో విషాద ఘటనలు

హైదరాబాద్ చందానగర్‌లో కుక్క తరమడంతో ఓ యువకుడు హోటల్ మూడో అంతస్తు నుంచి దూకి మృతి చెందాడు. చందానగర్ పీఎస్ పరిధిలో ఉన్న వివి ప్రైడ్‌ హోటల్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

author-image
By Vijaya Nimma
New Update

TG News: హైదరాబాద్ చందానగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. కుక్క తరమడంతో ఓ యువకుడు హోటల్ మూడో అంతస్తు నుంచి దూకి మృతి చెందాడు. చందానగర్ పీఎస్ పరిధిలో ఉన్న వివి ప్రైడ్‌ హోటల్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మూడో ఫ్లోర్‌కి కుక్క ఎలా వచ్చింది..?

స్థానిక వివరాల ప్రకారం..  తెనాలికి చెందిన ఉదయ్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి రామచంద్రపురం అశోక్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఆదివారం సరదాగా స్నేహితులతో గడిపేందుకు చందానగర్‌లోని వివి ప్రైడ్‌ హోటల్లో రూమ్ తీసుకున్నారు. అయితే మూడో అంతస్తు బాల్కనీలోకి వెళ్ళగానే ఒకసారిగా హోటల్లో కుక్క తరిమింది. భయాందోళనకు గురైన ఉదయ్.. హోటల్ మూడో అంతస్తు బాల్కనీ నుంచి కిందకి దూకాడు. తీవ్ర గాయాలైన ఉదయ్‌ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు  వెల్లడించారు. ఉదయ్‌ మరణించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అంతేకాకుండా ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు మూడో ఫ్లోర్‌కి కుక్క ఎలా వెళ్ళింది.. అనేదానిపైన కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోని.. పరిస్థితిని ఆరాధించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇది కూడా చదువండి: గుర్రం కంటే పాము వేగంగా వెళ్లగలదా..?

నిన్న కోతులు తరమడంతో తప్పించుకొనే క్రమంలో కిందపడి ఓ మహిళ దుర్మరణం చెందింది. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యానగర్‌లో  ఉన్న బొంగోని లక్ష్మి తన ఇంటి రేకుల షెడ్డుకింద ఉండగా కోతులమంద వచ్చింది. ఆమె అదిలించగా అవి బెదిరించాయి. వాటి బారి నుంచి తప్పించుకొనేందుకు ఇంట్లోకి పరుగుతీసే క్రమంలో ఆమె జారిపడి సిమెంట్‌ గచ్చుపై పడిపోయింది.  తల వెనుక భాగంలో బలమైన గాయం కావడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయిన ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. మృతురాలికి భర్త, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు.

ఇది కూడా చదువండి:  మలబద్ధకం వేధిస్తుందా.. ఇలా చేశారంటే మంచి ఉపశమనం

ఇది కూడా చదువండి: ఈ దేశాల్లో ఉద్యోగం వస్తే మీ లైఫ్ సెట్

 

ఇది కూడా చదవండి: కరివేపాకు నీటితో ఎంతటి పొట్ట అయినా కరగాల్సిందేనా?

Advertisment
Advertisment
తాజా కథనాలు