/rtv/media/media_files/2026/05/01/hyderabad-shamshabad-orr-road-accident-six-killed-2026-05-01-17-18-54.jpg)
Hyderabad Shamshabad ORR Road Accident Six Killed
Hyderabad Shamshabad ORR Road Accident
తెలంగాణలోని హైదరాబాద్ శివార్లలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ (ORR) ఎగ్జిట్ -16 సమీపంలో అత్యంత వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ భయంకరమైన ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మరొకరు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టిమిట్టాడుతున్నారు. ప్రస్తుతం క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. బాధితులు పెద్ద గోల్కండ నుంచి శంషాబాద్ వైపు వెళ్తుండగా ఈ ఘోరమైన ఘటన జరిగింది. అతివేగం, అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Follow Us