Paradise Offer: రిపబ్లిక్ డే వేళ ప్యారడైజ్ ఫ్రీ బిర్యానీ ఆఫర్.. వారికి పండగే పండగ!

ప్యారడైజ్ రెస్టారెంట్ రిపబ్లిక్ డే సందర్భంగా ఫ్రీ బిర్యానీ ఆఫర్ ప్రకటించింది. జనవరి 24 నుంచి 26 వరకు ఉంటుంది. కేవలం రెస్టారెంట్‌లో కూర్చొని తినేవారికి మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది. అది అయినా.. మీ వాట్సాప్ నెంబర్‌కు ఆఫర్ మెసేజ్ వస్తేనే ఇది వర్తిస్తుంది.

New Update
paradise restaurant free biryani offers

paradise restaurant free biryani offers

బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే. విషయం ఏదైనా బిర్యానీ ఉండాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా బిర్యానీకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. కొందరైతే రోజూ బిర్యానీ పెట్టినా వద్దనకుండా లాగించేస్తారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ బిర్యానీని ఇష్టపడతారు. అందులోనూ ప్యారడైజ్ బిర్యానీకి స్పెషల్ క్రేజ్ ఉంది. 

Also Read: మేడ్చల్ యువతి హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు..

టేస్ట్, క్వాంటిటీ పరంగా ప్యారడైజ్ బిర్యానీకి ఎంతో మంది మంత్రముగ్దులవుతున్నారు. అందువల్లనే జనాల ఆదరణ కూడా పెరిగింది. ఇప్పుడు మరింత మందిని అట్రాక్ట్ చేసేందుకు ప్యారడైజ్ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. తాజాగా ప్యారడైజ్ రెస్టారెంట్ ఎక్స్‌క్లూజివ్ ఆఫర్ ప్రకటించింది. 

Also Read: అమెరికాలోనే చరిత్రలోనే అతి పెద్ద ఏరివేత..వైట్ హౌస్

ఫ్రీ బిర్యానీ ఆఫర్

జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా కస్టమర్లకు ఫ్రీగా బిర్యానీ ఆఫర్ ప్రకటించింది. ప్రపంచంలోని ఇష్టమైన బిర్యానీని ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఎలాంటి కొనుగోలు చేయకుండానే ఈ ఆఫర్‌ను పొందవచ్చని ప్యారడైజ్ తెలిపింది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే.. ఈ ఆఫర్ కేవలం డైన్-ఇన్‌లో మాత్రమే వర్తిస్తుంది. అంటే రెస్టారెంట్‌లో కూర్చోని తినేవారికి మాత్రమే. పార్శిల్ తీసుకెళ్తామంటే కుదరదు.

FREE BIRYANI
FREE BIRYANI

 

Also Read: KCR Sister Dead: కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం..

ఈ ఆఫర్ జనవరి 24 నుంచి 26 వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. రెస్టారెంట్‌లోకి వెళ్లిన ప్రత ఒక్కరికి ఈ ఆఫర్ వర్తించదు. ప్యారడైజ్ సర్కిల్ నుంచి వాట్సాప్ నెంబర్‌కు ఫ్రీ బిర్యానీ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్‌ను (REP-KV915) దగ్గరలో ఉన్న ప్యారడైజ్ రెస్టారెంట్‌కు వెళ్లి చూపిస్తే ఈ ఆఫర్ వర్తిస్తుంది. మరి మీకు కూడా మెసేజ్ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.

Also Read: Bandla Ganesh vs Vijayasai: పాపం జగన్ ను వదిలేస్తావా.. విజయసాయిరెడ్డిపై బండ్ల గణేష్ సెటైర్లు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు