హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి ప్రమాదం తప్పింది. నగరంలో సుందరీకరణ పనుల్లో భాగంగా పర్యటన చేస్తుండగా.. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద ఆమె కాలు జారీ కిందపడిపోయారు. ఆమెకు స్వల్పంగా గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు ఆమెను పైకి లేపారు. ఆ తర్వాత ఆమె నడుచుకుంటూ ముందుకు సాగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. నెటీజన్లు విభిన్న రీతులో కామెంట్లు చేస్తున్నారు.
మేయర్ విజయలక్ష్మికి తప్పిన ప్రమాదం
— Telugu Scribe (@TeluguScribe) February 3, 2025
సుందరీకరణ పనుల్లో భాగంగా నగరంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా.. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద స్ట్రీట్ లైట్ పోల్ తట్టుకొని కింద పడ్డ మేయర్ గద్వాల విజయలక్ష్మి pic.twitter.com/AkB630LeJN
Also Read: హైదరాబాద్‌లో ఏఐ యూనివర్సిటీ.. మంత్రి శ్రీధర్ బాబు సంచనలన ప్రకటన
సోమవారం ఉదయం శేరిలింగంపల్లి జోన్ పరిధిలో పలు డివిజన్లలో మేయర్ విజయలక్ష్మి ఆకస్మికంగా పర్యటించారు. చందానగర్ సర్కిల్ పరిధిలోని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ పూజిత, జగదీశ్వర్ గౌడ్, జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి ఇతర అధికారులతో కలిసి ఆమె పర్యటించారు. కొత్త వేస్తున్న రోడ్ల నాణ్యతను పరిశీలించారు. అలాగే వివిధ కాలనీల్లో ఉన్న సమస్యలకు అడిగి తెలుసుకున్నారు. అలాగే GHMC ఖాళీ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా ఉండాలని అధికారులను ఆదేశించారు. అయితే సోమవారం విజయలక్ష్మీ ఇలా కాలు జారి పడిపోవడం సోషల్ మీడియాలో చర్చనీయమైంది.
Also Read: ఛీ ఛీ వీడేం వార్డెన్‌రా బాబూ.. అబ్బాయిలను రూమ్‌కు తీసుకెళ్లి బట్టలిప్పి!
Also Read: ఆప్ 55 స్థానాల్లో గెలుస్తుంది.. అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన