మిర్యాలగూడ వేములపల్లి రావువారిగూడానికి చెందిన సైదులు అనుమానంతో తన భార్యను కాలువలో నూకి చంపేశాడు. కాలువలో కొట్టుకుపోయిందని పోలీసులకు తెలపగా.. అనుమానం వచ్చిన పోలీసులు విచారణ చేయగా నేరాన్ని ఒప్పుకున్నాడు.
Nalgonda Crime: నల్లగొండ జిల్లాలో భార్యను సాగర్‌లో భర్త తోసేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తాను కూడా కాల్వలో దూకి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. తన భార్య కొట్టుకెళ్లిపోయి చనిపోయిందని భర్త పోలీసులకు చెప్పాడు. భర్త చెప్పే దానిపై పోలీసులకు అనుమానం రావడంతో.. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు.
అనుమానంతో చంపాడు..
పోలీసుల విచారణలో అసలు నిజం చెప్పాడు భర్త. మిర్యాలగూడ వేములపల్లి రావువారిగూడానికి చెందిన సైదులు, అనూషకు 16 ఏళ్ల కిందట కులాంతర వివాహం జరిగింది. అంగన్‌వాడీ టీచర్‌గా అనూష పని చేస్తోంది. భార్యపై సైదులు అనుమానం పెంచుకున్నాడు. స్కూల్ నుంచి ఇంటికి భార్యను తీసుకొస్తూ హత్య చేశాడు. సాగర్ ఎడమ కాల్వ దగ్గర భార్యతో గొడవ పడ్డాడు. కాల్వలో తోసేయడంతో భార్య అనూష కొట్టుకుపోయింది.
Indiramma illu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. మరో 30 వేల లిస్ట్ రిలీజ్!
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రేవంత్ సర్కార్ గుడ్ చెప్పనుంది. మొదటి విడతలో ఇళ్లు మంజూరు కానీ వారికోసం మరో లిస్ట్ తయారు చేస్తోంది. రెండో విడతలో 30 వేల మందికి ఇళ్లు ఇవ్వనుండగా వారి జాబితాను ఈ నెలాఖరులోగా విడుదల చేయనుంది.
Indiramma illu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రేవంత్ సర్కార్ గుడ్ చెప్పనుంది. మొదటి విడతలో ఇళ్లు మంజూరు కానీ వారికోసం మరో లిస్ట్ తయారు చేస్తోంది. రెండో విడతో 30 వేల మందికి ఇళ్లు ఇవ్వనుండగా వారి వివరాలను సేకరిస్తోంది.
మొత్తం 72 వేల మంది లబ్ధిదారులు..
ఈ మేరకు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే మొదటి విడతలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేయగా.. మొత్తం 72 వేల మంది లబ్ధిదారుల జాబితాను ఫైనల్ చేశారు. కానీ మొదటి విడతలో కొన్ని అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులోనూ చాలా మంది అనర్హులు ఉన్నారనే వాదనలు ఉన్నాయి. దీంతో 42 వేల మందికే ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వగా.. ఇప్పుడు మిగిలిన 30 వేల మంది వివరాలను సేకరిస్తున్నారు. రెండో జాబితాలో తప్పులు జరగకుండా చూసి ఇళ్లు మంజూరు చేయాలని జిల్లా అధికారులకు గృహ నిర్మాణ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఇక రెండో జాబితాలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా లిస్ట్ తయారు చేయాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. జూన్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల లోపు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. మొదటి విడతలో ఎంపిక చేసిన గ్రామాలను కాకుండా మిగతా గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీల లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు జాబితాలు అందాయి. లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల సలహాలు కూడా తీసుకుంటున్నారు. మొత్తం రెండు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల మందితో జాబితా తయారు చేస్తున్నారు. తుది లిస్టును ఈ నెలాఖరులోగా ప్రకటించనున్నట్లు సమాచారం.