TGSRTC :  సచివాలయంలో హైడ్రామా...మంత్రులు వస్తేనే చర్చలు.. జేఏసీ నేతల అల్టిమేటం

టీజీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల పిలుపుతో చేపట్టిన సమ్మె శుక్రవారం మూడో రోజుకు చేరింది. ప్రభుత్వం చర్చలకు పిలవడంతో సచివాలయానికి వచ్చిన ఆర్టీసీ జేఏసీ నేతలు, అక్కడ మంత్రుల రాక కోసం పట్టుబట్టడంతో పరిస్థితి నాటకీయంగా మారింది.

New Update
Secretariat – Telangana State

Secretariat – Telangana State

TGSRTC :  టీజీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల పిలుపుతో చేపట్టిన సమ్మె శుక్రవారం మూడో రోజుకు చేరింటీజీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల పిలుపుతో చేపట్టిన సమ్మె శుక్రవారం మూడో రోజుకు చేరిందిది. ఆర్టీసీ జేఏసీ నేతలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని ప్రకటించింది. దీంతో  తెలంగాణ సచివాలయం (సెక్రటేరియెట్) వేదికగా ఆర్టీసీ సమ్మె చుట్టూ నెలకొన్న రాజకీయ, పరిపాలనాపరమైన ఉత్కంఠ తీవ్రస్థాయికి చేరుకుంది. ప్రభుత్వం చర్చలకు పిలవడంతో సచివాలయానికి వచ్చిన ఆర్టీసీ జేఏసీ నేతలు, అక్కడ మంత్రుల రాక కోసం పట్టుబట్టడంతో పరిస్థితి నాటకీయంగా మారింది.

 ఆర్టీసీ సమ్మెకు ముగింపు పలికే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో, సచివాలయంలో శక్రవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. చర్చల కోసం వచ్చిన ఆర్టీసీ జేఏసీ నేతలకు, అధికారులకు మధ్య ప్రొటోకాల్ విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఆర్టీసీ జేఏసీ నాయకులు సచివాలయానికి చేరుకున్నారు. తొలుత రవాణా శాఖకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులతో జేఏసీ నేతలు ప్రాథమికంగా చర్చలు జరిపారు. తమ డిమాండ్ల పత్రాన్ని అధికారులకు అందజేశారు.

 అధికారులతో భేటీ అనంతరం, మంత్రుల సబ్ కమిటీతో సమావేశం ఉంటుందని భావించిన జేఏసీ నేతలు.. నేరుగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఛాంబర్‌లోకి వెళ్లారు. అక్కడ మంత్రుల కోసం వారు వేచి చూశారు.: మంత్రులు ఇతర సమావేశాల్లో బిజీగా ఉన్నారని, ప్రస్తుతానికి ఉన్నతాధికారులతోనే చర్చలు కొనసాగించాలని అధికారులు జేఏసీ నేతలను కోరారు. అయితే, దీనికి జేఏసీ నాయకులు ససేమిరా అన్నారు. "మేము అధికారులతో చర్చించడానికి రాలేదు.. నిర్ణయాలు తీసుకోగల మంత్రుల సబ్ కమిటీతోనే మాట్లాడతాం" అని వారు తెగేసి చెప్పారు.

మంత్రులు స్వయంగా చర్చలకు వస్తేనే తాము కూర్చుంటామని, లేనిపక్షంలో చర్చల నుంచి తప్పుకుని వెనక్కి వెళ్లిపోతామని జేఏసీ నాయకులు అల్టిమేటం జారీ చేశారు. సచివాలయ ప్రాంగణంలోనే ఈ ఉత్కంఠ కొనసాగుతుండటంతో.. అధికారులు వెంటనే ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు చేరవేశారు.

 డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం (ప్రస్తుతం మృతి) మరియు రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపుతో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ క్రమంలో సమ్మెను విరమింపజేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కానీ, మంత్రుల రాకలో జాప్యం జరగడంతో జేఏసీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.మంత్రుల సబ్ కమిటీ సభ్యులైన పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు జేఏసీ నేతలతో భేటీ అవుతారా? లేక ఈ చర్చలు అర్థాంతరంగా ముగుస్తాయా? అన్నది ఇప్పుడు సచివాలయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పరిస్థితిని గమనిస్తుంటే, ప్రభుత్వం దిగివచ్చి మంత్రులను చర్చలకు పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి..

Advertisment
తాజా కథనాలు