/rtv/media/media_files/2025/02/10/ruUDwpMjqQVhhDRgYGtC.webp)
Telangana High Court
HYDRA : హైడ్రాకు హైకోర్టు మరోసారి చివాట్లు పెట్టింది. ‘ఎన్నిసార్లు చెప్పినా.. మీరు మారరా?’ అంటూ ధర్మాసనంఫైర్ అయింది. అక్రమ నిర్మాణమంటూ శుక్రవారం నోటీసులిచ్చి, వివరణ ఇచ్చేందుకు శనివారం ఒక్కరోజే సమయమిచ్చి, ఆదివారం కూల్చివేతలు చేపట్టాల్సినంత తొందరేముంది? అని ప్రశ్నించింది.ఆదివారమే కూల్చివేతలు చేపట్టాల్సిన అవసరమేముందని ప్రశ్నించింది.రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడ గ్రామంలోని ఆస్తుల కూల్చివేతను సవాల్ చేస్తూ సామ్రెడ్డి బాలారెడ్డి ఆదివారం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా నోటీసులు చట్ట విరుద్ధమని, వాటిని రద్దు చేస్తూ ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు.
Also Read : ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై విచారణ.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘‘అక్రమ నిర్మాణమంటూ అధికారులు శుక్రవారం పిటిషనర్ కు నోటీసులు ఇచ్చారు. వ్యక్తిగతంగా హాజరుకావాలని శనివారం సమయం ఇచ్చారు. ఆ వెంటనే ఆదివారం కూల్చివేతలు చేపట్టారు. టైటిల్ లింక్ పత్రాలు, పట్టాదార్ పాస్‌బుక్, ఇతర అన్ని డాక్యుమెంట్లతో రావాలని ఆదేశించిన అధికారులు.. ఒక్క రోజే సమయం ఇచ్చారు. అధికారుల తీరు చట్టవిరుద్ధం. నోటీసులను నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వాలి’’ అని కోరారు.వాదనలు విన్న న్యాయమూర్తి.. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : ముగిసిన ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్.. ఫైనల్ లెక్కలివే!
నోటీసులు జారీచేశాక ఆధారాలు సమర్పించి, వివరణ ఇవ్వడానికి గడువు ఇవ్వకుం డా కూల్చివేతలు చేపట్టడంపై మండిపడింది. ఎన్నిసార్లు చెప్పినా హైడ్రా తీరు మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కూల్చివేతలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి, నోటీసులపై వారంలోగా సమాధానమివ్వాలని పిటిషనర్‌ను ఆదేశించింది. పిటిషనర్‌కు న్యాయమైన అవకాశం ఇవ్వకుండా తదుపరి చర్యలు తీసుకోవద్దని హైడ్రాను ఆదేశించారు. అవసరమైన పత్రాలను సమర్పించడానికి పిటిషనర్‌కు ఒక వారం సమయం ఇచ్చారు. వాటిని పరిశీలించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని హైడ్రాను ఆదేశించారు. అలాగే నోటీసులు జారీ, విచారణ, కూల్చివేతలు.. స్వల్పకాలంలో చేపట్టేలా నిర్ణయాలు తీసుకోవద్దని తేల్చిచెప్పారు. ముఖ్యంగా సెలవు దినాల్లో కూల్చివేతలు చేపట్టవద్దని, అయినా చేపడితే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Also Read: ఢిల్లీ ఫలితాలపై కోమటిరెడ్డి రియాక్షన్.. కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్!
గతంలోనూ హైడ్రాపై హైకోర్టు ఫైర్ అయింది. ఎఫ్‌టీఎల్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలున్నాయంటూ నోటీసులు ఇచ్చి, తక్షణమే హైడ్రా చర్యలు చేపట్టడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. జారీ చేసిన నోటీసులకు బాధితులు వివరణ ఇచ్చే దాకా కూడా ఆగకండా అంత హడావిడి ఎందుకని ప్రశ్నించింది. బాధితుల వివరణను తీసుకుని, దాన్ని 4 వారాల్లో పరిష్కరించి, తరువాత చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని హైడ్రాను ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా అల్మాస్‌గూడలో ఉన్న నిర్మాణాలను తొలగించాలంటూ ఈ నెల 10న ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ అంజిరెడ్డి సోమవారం హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి అనుమతించిన జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం మధ్యాహ్నం విచారణ చేపట్టారు. హైడ్రాపై అసహనం వ్యక్తం చేశారు.
Also Read: కష్టాన్ని ఇష్టంగా చేసుకోండి.. విద్యార్థులతో ప్రధాని ఇంట్రెస్టింగ్ చిట్ చాట్