టాలీవుడ్, రాజకీయ వర్గాల మధ్య ఇప్పుడు ‘డ్రగ్స్’ చిచ్చు రేగుతోంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సినీ ప్రముఖులపై చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపగా, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అంతే ఘాటుగా బదులిచ్చారు. వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు:
సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయిందని ఆరోపిస్తూ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వివాదానికి తెరలేపారు. హీరోలకు డ్రగ్ టెస్టులు తప్పనిసరి చేయాలని ఆయన అన్నారు. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోలు ప్రతి 90 రోజులకు ఒకసారి డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలి. రిపోర్టులో నెగటివ్ వస్తేనే వారి సినిమాలను థియేటర్లలో విడుదల చేయనివ్వాలి. సినీ ఇండస్ట్రీలోనే దేశంలోనే అతిపెద్ద డ్రగ్ యాక్టివిటీ జరుగుతోందని, పరీక్షలు చేయించుకోకపోతే వారు డ్రగ్స్ తీసుకున్నట్లేనని సంచలన ఆరోపణలు చేశారు. "పవన్ కల్యాణ్ సినిమాలో గుడుంబా తాగితే హీరో అంటారు.. నేను సారా గురించి మాట్లాడితే తప్పవుతుందా? సినిమా వాళ్ళు గ్లాసు పట్టుకుంటే హీరోలా? రాజకీయ నాయకులు పట్టుకుంటే జీరోలా?" అంటూ ఆయన ప్రశ్నించారు.
మంచు విష్ణు ‘లై డిటెక్టర్’ కౌంటర్:
ఎమ్మెల్యే వ్యాఖ్యలపై టాలీవుడ్ తరపున మంచు విష్ణు ధీటుగా స్పందించారు. ఎక్స్‌లో ఆయన రాజకీయ నాయకులపై సెటైర్లు వేశారు.
లై డిటెక్టర్ టెస్ట్: "హీరోలకు డ్రగ్ టెస్ట్ చేయాలంటున్న లీడర్లకు.. ఎన్నికల ముందు 'లై డిటెక్టర్' (అబద్ధాలు కనిపెట్టే) పరీక్ష చేయాలి. అప్పుడు ఎవరు నిజాలు చెబుతున్నారో, ఎవరు అబద్ధపు హామీలు ఇస్తున్నారో ప్రజలకు తెలుస్తుంది" అని విష్ణు కౌంటర్ ఇచ్చారు. రాజకీయ నాయకులకు ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తే ఓటర్లు అందరికంటే ఎక్కువగా సంతోషిస్తారని, అసలు లీడర్లు ఈ పరీక్షకు సిద్ధమేనా? అని ఆయన సవాల్ విసిరారు.
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నేరుగా పవన్ కల్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర నటుల పేర్లను ప్రస్తావించడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ ‘టెస్టుల’ వివాదం ఇటు సినీ ఇండస్ట్రీని, అటు రాజకీయ వర్గాలను కుదిపేస్తోంది. మరి దీనిపై టాలీవుడ్ పెద్దలు ఇంకా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
టాలీవుడ్‌లో ‘డ్రగ్స్ టెస్ట్’ రచ్చ.. వాళ్లకు ‘లై డిటెక్టర్’ టెస్ట్ చేయాలంటూ కౌంటర్!
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సినీ ప్రముఖులపై చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపగా, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అంతే ఘాటుగా బదులిచ్చారు. వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.