Harish Rao: ఇవి సరే.. రూ.12,400 కోట్ల ఒప్పందాల సంగతేంటి: హరీష్ రావు

అదానీ ప్రకటించిన రూ.100 కోట్లు విరాళాన్ని సీఎం రేవంత్ తిరస్కరించడంపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి సరే.. ఆదానితో దావోస్ లో చేసుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాల మాటేమిటో చెప్పాలన్నారు. అదానీతో అన్ని ఒప్పందాలు ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. 

New Update
rerer

Telangana : స్కిల్స్‌ ఇండియా యూనివర్సిటీకి అదానీ ప్రకటించిన రూ.100 కోట్లు విరాళాన్ని తిరస్కరించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన కామెంట్స్ చేశారు. ఈ వంద కోట్లు సరే.. ఆదానితో దావోస్ లో చేసుకున్న రూ. 12,400 కోట్ల ఒప్పందాల మాటేమిటని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ.. అదానీ అవినీతి మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని నినదిస్తున్న సమయంలో దావోస్ లో మీరు ఆదానితో  చేసుకున్న ఒప్పందాలపై క్లారిటీ ఇవ్వాలన్నారు. 

ఇది కూడా చదవండి: పిల్లలకు ఈ వయసు వచ్చే వరకు షుగర్‌ పెట్టొద్దు

మీరు చేస్తున్న కుట్రల మాటేమిటి?

ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టిన హరీష్.. 'అదానీకి రాష్ట్రంలోని డిస్కంలను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు మీరు చేస్తున్న కుట్రల మాటేమిటి? రూ. 20 వేల మెగావాట్ల థర్మల్ ప్లాంట్ పెడుతామనే ప్రతిపాదనతో వస్తే, మర్యాదపూర్వకంగా కలిసి చాయ్ తాగించి పంపించేశాం. కానీ కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటించింది. రాహుల్ గాంధీ అవినీతి పరుడు అన్న వ్యక్తికే గల్లీ కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరిచింది. ఢిల్లీలో రాహుల్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆదానితో రేవంత్ రెడ్డి దోస్తీ చేసి ఒప్పందాలు చేసుకున్నాడు. ఇప్పుడు ఆదాని అవినీతి బయటికిరాగానే మాట మార్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాల‌న్నింటినీ ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాం' అని అన్నారు. 

ఇది కూడా చదవండి: Bit Coin : మీ దగ్గర బిట్ కాయిన్ ఉందా... అయితే మీరు కోటీశ్వరులైనట్లే..

ఇదిలా ఉంటే.. రేవంత్ సర్కారు నిర్లక్ష్యానికి బలైపోయిన వాంకిడి గిరిజన గురుకుల విద్యార్థిని శైలజకు కన్నీటి నివాళి అర్పించారు హరీష్‌ రావు. మీ ప్రాణాలు బలి తీసుకున్న పాపం.. ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ను వెంటాడుతది. 25 రోజులుగా నువ్వు వెంటిలేటర్ మీద అనుభవించిన నరకానికి ప్రభుత్వమే జవాబుదారీ. ఆ తల్లిదండ్రులకు గుండె కోతను మిగిల్చిండు సీఎం రేవంత్ రెడ్డి. తోటి విద్యార్థులతో ఆడుతూ, పాడుతూ బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన ఆ చిన్నారి.. విషాహారం వల్ల కన్నుమూయటం కలిచి వేస్తున్నది. ప్రభుత్వ నిర్లక్ష్యం అభం, శుభం తెలియని గిరిజన బిడ్డకు శాపంగా మారింది. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.

Also Read :  10 ఏళ్ళుగా ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా ఎంపిక.. ఏ దేశమో తెలుసా..?

ఇది కూడా చదవండి: చాగంటి కోటేశ్వరరావుకు సీఎం చంద్రబాబు కీలక సూచన.. అలా చేయాల్సిందే!

వాంకిడి గురుకులంలో నాణ్యత లేని భోజనం పెట్టడం పాపం కాగా, అస్వస్థతకు గురైన విద్యార్థులకు సకాలంలో మెరుగైన చికిత్స అందించకపోవడం మరొక పాపం. అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం విద్యార్థిని ప్రాణాల మీదకు తెచ్చింది. మ్స్ ఆసుపత్రిలో బిడ్డను పట్టుకొని అక్కడే ఉన్న ఆ తల్లిదండ్రులకు భరోసా ఇవ్వడంలోనూ సర్కారు పూర్తి వైఫల్యం చెందింది. చివరకు ఆ అమ్మాయి చావును కూడా దాచి పెట్టాలనే ఉద్దేశ్యంతో, దొంగ చాటున మృతదేహాన్ని తరలిస్తుండడం సిగ్గుచేటు. గిరిజన విద్యార్థినీ కుటుంబానికి బాధ్యత వహించి 50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BRS Silver Jubilee Meeting Live Updates: బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. లైవ్ అప్డేట్స్!

ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ హన్మకొండ జిల్లాలలోని ఎల్కతుర్తిలో జరగనుంది. ఈ సభలో కేసీఆర్ రేవంత్ సర్కార్ పై సమర శంఖం పూరించనున్నారు. సభ లైవ్ అప్డేట్స్ ను ఇక్కడ చూడండి.

author-image
By Nikhil
New Update
BRS Public Meeting Warangal

BRS Public Meeting Warangal

  • Apr 27, 2025 12:27 IST

    సభకు ఏర్పాట్లు పూర్తి



  • Apr 27, 2025 12:26 IST

    గన్ పార్క్ వద్ద నివాళులర్పిస్తున్న బీఆర్ఎస్ నేతలు



  • Apr 27, 2025 12:26 IST

    సభకు బయలుదేరిన ఇబ్రహీంపట్నం కార్యకర్తలు



  • Apr 27, 2025 12:25 IST

    తెలంగాణ భవన్ లో రజతోత్సవ వేడుకలు



Advertisment
Advertisment
Advertisment