/rtv/media/media_files/2026/02/22/fotojet-40-2026-02-22-20-45-32.jpg)
Hakimpeta Sports School.. Student attempts suicide
Sports School : శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో కలకలం చెలరేగింది. స్కూల్లో ఏడవతరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు యత్నించడంతో విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్పోర్ట్స్ స్కూల్ హాస్టల్లో ఉంటున్న 7వ తరగతి విద్యార్థి శ్రీనాథ్ ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. కాగా దీన్ని గమనించిన తోటి విద్యార్థులు వెంటనే సిబ్బందికి సమాచారం అందించారు. స్పందించిన సిబ్బంది అక్కడికి చేరుకుని విద్యార్థిని అత్యవసర చికిత్స కోసం కొంపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
కాగా సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన శ్రీనాథ్ కు గతంలో ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్ లో సీటు వచ్చింది. అయితే గత సంవత్సరం ఆదిలాబాద్ నుంచి హకీంపేటకు బదిలీ చేయించుకున్నారు. అయితే విద్యార్థి ఆత్మహత్యకు ఒత్తిడి కారణమా? లేదా మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది.
విషయం తెలుసుకున్న రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలాదేవి హుటాహుటినా కొంపల్లిలోని ఆసుపత్రికి చేరుకున్నారు. విద్యార్థి పరిస్థితిపై డాక్టర్లతో , విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యార్థి చికిత్సకు ఎంతటి ఖర్చు అయిన ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి వెల్లడించారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు జరిపి నివేదిక అందించాలని మంత్రి ఆదేశించారు.
Follow Us