TGPSC Group-2 Results: గ్రూప్-2 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ లింక్ ఇదే!

గ్రూప్-2 ఫలితాలు విడుదలయ్యాయి. జనరల్ ర్యాంకింగ్‌ లిస్ట్‌తో పాటు ఫైనల్‌ కీని టీజీపీఎస్సీ విడుదల చేసింది. మార్కులతో పాటు అభ్యర్థులు OMR షీట్లను కూడా కమిషన్‌ వైబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. లింక్‌ కోసం ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
V BREAKING

గ్రూప్-2 ఫలితాలు విడుదలయ్యాయి. జనరల్ ర్యాంకింగ్‌ లిస్ట్‌తో పాటు ఫైనల్‌ కీని టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఫలితాల కోసం  https://www.tspsc.gov.in/   ఈ లింక్‌పై క్లిక్ చేయండి. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం ఫలితాలు విడుదల చేశారు. మార్కులతో పాటు అభ్యర్థులు OMR షీట్లను కూడా కమిషన్‌ వైబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. గ్రూప్‌ 2 ఫైనల్‌ ఆన్సర్‌ కీతో పాటుగానే టాపర్స్‌ జాబితాను కూడా టీజీపీఎస్సీ అధికారులు విడుదల చేశారు. 

Also Read: రన్యా రావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో మరో ట్విస్ట్.. కర్ణాటక సర్కార్‌ కీలక ఆదేశం

783 పోస్టుల భర్తీకి 2022లో గ్రూప్‌-2 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. 2024 డిసెంబర్‌ 16,17 తేదీల్లో ఈ పరీక్షలు జరిగాయి. మొత్తం 368 కేంద్రాల్లో ఈ రాత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 5 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ కేవలం 46 శాతం మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. 

Also Read: హైదరాబాద్‌లో విషాదం.. స్నానం చేస్తుండగా లా స్టూడెంట్‌కు గుండెపోటు.. అక్కడికక్కడే..!

ఈ పరీక్షల ప్రాథమిక ఆన్సర్‌ కీ ని జనవరి 17న టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఆన్సర్‌ కీ అభ్యంతరాలను జనవరి 22వ తేదీ వరకు స్వీకరించింది. ఇక చివరి ఆన్సర్‌ కీని రూపొందించిన కమిషన్‌ తాజాగా ఫలితాలు విడుదలచేసింది. మొత్తం 4 పేపర్లకు గ్రూప్‌ 2 పరీక్షలు జరిగాయి. ఫలితాల కోసం అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు కమిషన్ తాజాగా ఫలితాలు విడుదల చేసింది. 

Also Read: చైనా సైంటిస్టుల అద్భుతం.. గుండెపోటు, స్ట్రోక్స్ రాకుండా వ్యాక్సిన్!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు