TGPSC Group 1: తెలంగాణలో రేపటి నుంచి గ్రూప్-1 మెయిన్స్

తెలంగాణలో రేపటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 27వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఈ పరీక్షలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. తొలిసారి ప్రశ్నపత్రాల వాహనాలకు జీపీఎస్ ట్రాకర్లను పెట్టారు.

New Update
Group 3: గ్రూప్ 3 అభ్యర్థులకు అలెర్ట్.. టీజీపీఎస్సీ కీలక ప్రకటన

TGPSC Group 1: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షపై గందరగోళం నెలకొంది. రేపటి నుంచి ఈ నెల 27వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ పరీక్ష నిర్వహణకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. తొలిసారి ప్రశ్నపత్రాల వాహనాలకు జీపీఎస్ ట్రాకర్లను పెట్టారు. కాగా ఈ మెయిన్స్ పరీక్షను రద్దు చేయాలంటూ అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. అలాగే జీవో 29ను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్-1 అభ్యర్థులకు ప్రతిపక్షల మద్దతు లభించడంతో వారిని ఆందోళనకు మరింత బలం చేకూరినట్లైంది. కాగా ఈ పరీక్షపై నిన్న మంత్రులు, ఉన్నత అధికారులు కీలక సమావేశం అయ్యారు. ఈరోజు ఈ పరీక్షపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: ఏపీకి అలర్ట్.. మరో అల్పపీడనంతో భారీ వర్షాలు

సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు...

గ్రూప్‌-1 మెయిన్స్‌పై రేవంత్ (CM Revanth Reddy) సంచలన ప్రకటన చేశారు. గ్రూప్‌-1 పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగవు అని తేల్చి చెప్పారు. ఈ నెల 21 నుంచి ఎగ్జామ్స్ యథాతథంగా జరుగుతాయని అన్నారు. ప్రతిపక్షాల మాయమాటలు నమ్మకండి అని అభ్యర్థులను కోరారు. ఇప్పటికే 95 శాతం మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని అన్నారు. పరీక్షలు వాయిదా వేస్తే విద్యార్థులకే నష్టం అని అన్నారు. ఆందోళనలు విరమించి పరీక్షలకు సిద్ధం కండి అని చెప్పారు. గ్రూప్‌-1 అభ్యర్థులపై కేసులు పెట్టొద్దు...కేసులు పెడితే ఉద్యోగులకు అనర్హులు అవుతారని అన్నారు. ఆందోళన కారులపై లాఠీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదని పోలీసులను కోరారు.

ఇది కూడా చూడండి: Ap: కృష్ణా నదిలో వరద..శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత

ఇంకా 5 శాతం మంది...

ఇటీవల TGPSC గ్రూప్-1 హాల్ టికెట్లను విడుదల చేసింది. కాగా ఇప్పటికి 95 శాతం మంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. మిగితా 5 శాతం మంది కూడా తమతమ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు https://hallticket.tspsc.gov.in/h022024d08f5d90-6aaa-4360-acb2-046f588e3284 లింక్ పై క్లిక్ చేసి తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 22న గ్రూప్-1 టీజీపీఎస్సీ నోటిఫికేషన్ (TGPSC Group-1) విడుదల చేసింది. మొత్తం 563 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. జూన్ 9న ఇందుకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ పరీక్షకు మొత్తం 3.02 లక్షల మంది హాజరు కాగా.. 31,382 మంది మెయిన్స్ కు ఎంపికయ్యారు.

ఇది కూడా చూడండి:

అమరావతి పనులను తిరిగి ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Waynad: వయనాడ్‌లో ఖుష్బూ కాదు.. బీజేపీ అభ్యర్ధి నవ్య హరిదాస్

Advertisment
Advertisment
తాజా కథనాలు