చెత్త వేస్తే చలానా.. ఫొటో తీసి మరీ పట్టుకుంటారు.. GHMC నయా యాప్ రెడీ! రోడ్డు పక్కన చెత్త వేసే వారిని పట్టుకోవడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త యాప్‌ను అభివృద్ధి చేస్తోంది. ట్రాఫిక్ చలానా మాదిరిగా చెత్త వేసిన కూడా ఫొటో తీసి జరిమానా విధించనున్నారు. డిసెంబర్ 1వ తేదీన ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. By Kusuma 19 Nov 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి చెత్త వేయడానికి వాహనాలు ఉన్నా కూడా కొందరు రోడ్డు పక్కన పడేస్తుంటారు. ఇలా రోడ్డు పక్కన చెత్త పడేయకుండా ఉండటానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త యాప్‌ను రెడీ చేస్తోంది. వాహనాల నంబర్ల ఆధారంగా ట్రాఫిక్ చలానాకి జరిమానా విధిస్తున్నారో.. అలాగే రోడ్డు పక్కన చెత్త వేసే వారికి కూడా జరిమానా విధించనున్నారు. ఇది కూడా చూడండి: ఎంతకు తెగబడ్డారేంట్రా.. ఏకంగా RBI గవర్నర్ డీప్ ఫేక్ వీడియోను ఎలా చేశారో చూడండి! రోడ్లపై చెత్త వేయకుండా ఉండేందుకు.. దీనికోసం ప్రత్యేకంగా ఓ నయా యాప్‌ను బల్దియా ఐటీ విభాగం రూపొందిస్తోంది. వచ్చే నెల 1 నుంచి ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. రోడ్లపై వ్యర్థాలు వేయడం వల్ల అంతా శుభ్రం లేకుండా కనిపిస్తుంది. ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పిన కూడా ప్రజల వైఖరి మారడం లేదు. వ్యాపారులు కాదని రోడ్లపై చెత్త వేస్తే దుకాణాలను సీజ్ చేసే నిర్ణయం తీసుకురావాలని అనుకుంటున్నారు. ఇది కూడా చూడండి: 25 నుంచి పార్లమెంట్.. జమిలీ ఎన్నికలతో పాటు రానున్న కీలక చట్టాలివే! కుటుంబంలో భార్యాభర్తలు ఉద్యోగులు అయిన, బ్యాచిలర్లు ఇలా రోడ్లపైనే చెత్త వేస్తున్నారు. ముఖ్యంగా మురికి వాడల్లో అయితే రోడ్డు పక్కనే చెత్త వేస్తున్నారు. వీటిపై నిఘా ఉంచాలని జీహెచ్‌ఎంసీ అధికారులు కొత్త యాప్‌ను తీసుకురానున్నారు. ఇది కూడా చూడండి: Etela Rajender: రేవంత్ నీ బతుకెంతా.. ఈటల సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసిన కూడా రోడ్లపై చెత్తను కనిపిస్తుంది. కొందరు చెత్త వాహనాల్లో వేయకుండా రోడ్డు మీద పడేసి వెళ్తుంటారు. దీనివల్ల దుర్వాసన, దోమలు ఎక్కువగా అవుతాయి. దీంతో చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దీన్ని నివారించడానికి జీహెచ్‌ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ యాప్ ద్వారా అయిన రోడ్లపై చెత్తను వేయడం ఆపుతారేమో. ఇది కూడా చూడండి: 9 ఏళ్లకే గర్భం దాల్చిన బాలిక.. షాకింగ్ వీడియో వైరల్! #hyderabad #ghmc #garbage మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి