/rtv/media/media_files/2025/02/27/9I4wWRuF2YgScasu7VBM.jpg)
MLC polling 123 Photograph: (MLC polling 123)
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆంధ్ర ప్రదేశ్‌లో 70 మంది, తెలంగాణలో 90 మంది అభ్యర్థులు MLC ఎన్నికల బరిలో ఉన్నారు. పట్టభద్రుల, టీచర్స్ MLC లను ఎన్నుకోడానికి అధికారులు అన్నీ ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు కొనసాగుతుంది.
Also read : SpaceX launched IM-2: చంద్రుడిపైకి మానవ మనుగడ.. స్పేస్X మిషన్‌లో కీలక పరిణామం
మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ జిల్లాల పట్టభద్రులు, అదే జిల్లాల ఉపాధ్యాయ, వరంగల్–ఖమ్మం–నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 973 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అటు ఆంధ్ర ప్రదేశ్‌లో ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీతోపాటు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాకు పోలింగ్ జరుగుతోంది.
Also Read : వాహనాలకు ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇది లేకుంటే కేసు ఫైల్, బండి సీజ్!
ఏపీలో రెండు పట్టభద్రులు, ఒక ఉపాధ్యాయ నియోజకవర్గానికి పోలింగ్ జరుగుతుండగా.. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరుగుతుంది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహణకు అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మార్చి 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి.