/rtv/media/media_files/2025/04/01/MlDfCdaWhUYO1qZWmLHF.jpg)
LAYOUT REGULARIZATION SCHEME (LRS)
LRS : తెలంగాణలోని లేఅవుట్ల క్రమబద్ధీకరణకు (LRS) ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీ గడువు నిన్నటితో (మార్చి 31) ముగిసింది. లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకంలో భాగంగా ప్రభుత్వం 25 శాతం రాయితీతో వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌ను ప్రకటించింది. అనధికారిక లే అవుట్లలో ప్లాట్ల క్రమబద్దీకరణ కోసం ఈ స్కీంను ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. అయితే మార్చి 31కో గడువు ముగియగా.. చాలా మంది ఇంకా పథకాన్ని వినియోగించుకోలేదు.
Also Read: బంగ్లాలో పడిపోతున్న వస్త్ర పరిశ్రమ..200లకు పైగా ఫ్యాక్టరీలు క్లోజ్
ఆదివారం ఉగాది, సోమవారం రంజాన్ పండగ ఉండగా.. ఆయా రోజుల్లో డబ్బులు సర్దుబాటు చేసుకోవడం కష్టమైందని ప్రజలు వాపోతున్నారు. మరో నెల రోజులైనా OTS గడువును పొడిగించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపులో ఇబ్బందులు, టెక్నికల్ సమస్యల వల్ల లబ్ధి పొందలేకపోయామని అంటున్నారు. ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పథకం గడువును మరో నెల రోజులు పొడిగించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ఇంకా అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. 25 శాతం రాయితీతో కాకుండా కండీషన్లతో ఓటీఎస్ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు.
Also Read: హెచ్‌సీయూను ముట్టడించిన విద్యార్థులు.. పరిస్థితి ఉద్రిక్తం
ప్రస్తుతం చెల్లించాల్సిన ఫీజులో 25 శాతం రాయితీ ఇస్తున్నారు. దీనిని ఏప్రిల్ 1 నుంచి 15 వరకు 15 శాతానికి తగ్గించే అవకాశం ఉంది. ఆ తర్వాత రాయితీ పూర్తిగా తీసివేస్తారు. అంటే పూర్తి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 2020లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారికి మార్చి 31 వరకు 25 శాతం రాయితీతో ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. ఇప్పటివరకు దాదాపు 4 లక్షల మంది దరఖాస్తుదారులు రూ.1200 కోట్ల వరకు ఫీజు చెల్లించారు. ఈ పథకం మొదలైన తర్వాత కొన్ని సమస్యలు వచ్చాయి. వాటిని అధికారులు పరిష్కరించేలోపే గడువు దగ్గరపడింది.ఉగాది, రంజాన్ పండుగల వల్ల చివరి రెండు రోజుల్లో పథకం అమలు నెమ్మదించింది. అందుకే గడువును పొడిగించాలని చాలామంది దరఖాస్తుదారులు కోరారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఓటీఎస్‌ను మరో నెల రోజులు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై సర్కార్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.