Pahalgam Terror Attack: టార్గెట్ హైదరాబాద్‌..  ఆ ప్రాంతాలపైనే ఉగ్రవాదుల ఫోకస్!

పహల్గామ్ ఉగ్రదాడి ఇప్పుడు దేశంలోని కొన్ని నగరాలకు ఉగ్ర ముప్పు ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో హైఅలర్ట్ విధించారు. ముఖ్యంగా ముంబై నగరాల్లో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
Hyderabad Skywalks4

Hyderabad

Pahalgam Terror Attack: జమ్మూకశ్మీర్‌ పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేశంలోని కొన్ని నగరాలకు ఉగ్ర ముప్పు ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో హైఅలర్ట్ విధించారు. ముఖ్యంగా ముంబై నగరాల్లో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వెంటనే హైఅలర్ట్ జారీ చేశారు.

ఇది కూడా చూడండి: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?'

ఈ నగరాల్లోనే..

ఉగ్రవాదుల ఎక్కువగా మెట్రో నగరాలు, జనాభా అధికంగా ఉన్న దగ్గర దాడులు చేస్తారు. గతంలో ముంబైలో వరుస పేలుళ్లు, హైదరాబాద్ గోకుల్ చాట్, లుంబిని పార్క్, దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల వంటి ముష్కర దాడులను ఇంకా జనం మర్చిపోలేదు. ఈనేపథ్యంలోనే తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశమున్నట్లుగా అంచనా వేశారు.

ఇది కూడా చూడండి: PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన

ఇది కూడా చూడండి: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?

ఇదిలా ఉండగా.. జమ్మూకశ్మీర్‌ పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. స్టీల్ టిప్డ్ బుల్లెట్లు, AK-47 రైఫిళ్లు, బాడీ కెమెరాలు ధరించిన నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల బృందం హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి జమ్మూ కాశ్మీర్ సందర్శించడానికి వెళ్లిన పర్యాటకులు మృతి చెందారు. 

Advertisment
Advertisment
Advertisment