/rtv/media/media_files/2025/03/24/208FP0cDrEKm2y246TB4.jpg)
Jagadish Reddy vs. Marshals
Jagadish Reddy: తెలంగాణ శాసనసభ నుంచి సస్పెన్షన్ కు గురైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఇవాళ అసెంబ్లీ వద్ద రచ్చ చేశారు. అసెంబ్లీకి రావొద్దని సూచించిన చీఫ్ మార్షల్ కరుణాకర్ తో వాగ్వాదానికి దిగారు. తనను అసెంబ్లీకి రావొద్దని స్పీకర్ ఇచ్చిన బులిటెన్ చూపించాలని డిమాండ్ చేశారు. సభలో చేసిన వ్యాఖ్యల కారణంగా జగదీశ్ రెడ్డిని ఈ సెషన్ పూర్తి కాలం సభ నుంచి స్పీకర్ బహిష్కరించిన సంగతి తెలిసిందే. అయినా జగదీశ్ రెడ్డి ఇవాళ అసెంబ్లీ లాబీకి వచ్చారు. ఆయనను మార్షల్స్ అడ్డుకుని బయటకు వెళ్లాలని కోరారు. దాంతో ఇప్పటి వరకు నన్ను సస్పెండ్ చేస్తూ బులెటిన్ ఇవ్వలేదని తనను రావద్దని స్పీకర్ ఇచ్చిన బులిటెన్ చూపించాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ క్రమంలో చీఫ్ మార్షల్ తో జగదీశ్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. అనంతరం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన జగదీశ్ రెడ్డి అసెంబ్లీ ఇష్టారాజ్యంగా నడుస్తోందని, పద్ధతి ప్రకారం నడవట్లేదని విమర్శించారు. మేము కోర్టుకు వెళ్తామని భయంతోనే సస్పెండ్ చేసినట్లు బులెటెన్ ఇవ్వట్లేదని ఆరోపించారు.
Also read: BIG BREAKING: చికెన్ తింటే బర్డ్‌ఫ్లూ వస్తుందని.. జాతీయ పక్షి నెమలిని చంపిన వ్యక్తి
స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా జగదీశ్ రెడ్డిపై బడ్జెట్ సెషన్ ముగిసే వరకు సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. మార్చి 13న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పీకర్ ను నువ్వు అని సంబోధించారు. ‘సభ మీ సొంతం కాదు సభ అందరిదీ సభకు మీరు పెద్ద మనిషి మాత్రమే’ అని స్పీకర్ ను ఉద్దేశించి వ్యాఖ్య చేశారు. దళిత స్పీకర్ ను కావాలని అవమానించారని కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. స్పీకర్ చైర్ ను అవమాన పర్చేలా వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రిపై వేటు వేయాలని ప్రతిపాదిస్తూ శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీర్మానం ప్రవేశపెట్టగా..ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
Also Read: IMD -Ap: మరో నాలుగు రోజులు వడగళ్ల వానలు..జాగ్రత్త..వాతావరణ శాఖ హెచ్చరికలు!
Also Read: Tech Mahindra: ఖతార్ లో గుజరాత్ కి చెందిన టెక్ మహీంద్రా ఉద్యోగి అరెస్ట్