కాంగ్రెస్‌లో కడియం లొల్లి.. తలపట్టుకున్న పెద్దలు! TG: వరంగల్ కాంగ్రెస్‌లో వర్గపోరు భగ్గుమంది. కడియం శ్రీహరిని కాంగ్రెస్‌లో చేర్చుకోడాన్ని సింగాపురం ఇందిర మద్దతుదారులు వ్యతిరేకిస్తున్నారు. కడియంను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏం చేయాలో తెలియక కాంగ్రెస్ పెద్దలు తలపట్టుకుంటున్నారట. By V.J Reddy 17 Oct 2024 in తెలంగాణ వరంగల్ New Update షేర్ చేయండి Warangal Congress: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న, మొన్నటి వరకు మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఉదంతం మరవకముందే స్టేషన్ ఘన్‌పూర్ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు మొదలైంది. స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై (Kadiyam Srihari) ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు. మొదటి నుంచి కడియం కాంగ్రెస్ చేరికను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నాయకులు సందర్భం వచ్చిన ప్రతిసారి కడియంకు వ్యతిరేకంగా పావులు కదుపుతూనే ఉన్నారు. ఇది కూడా చదవండి: విచారణకు రమ్మన్నారు.. సజ్జల అరెస్ట్ తప్పదా? తాజాగా పార్టీలో, ప్రభుత్వ పదవుల్లో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి కాకుండా.. కడియం శ్రీహరి వర్గీయులకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తూ స్థానిక కాంగ్రెస్ నేత సింగాపురం ఇందిర మద్దతుదారులు ధర్నాకు దిగారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్ మండలం కరుణాపురం వద్ద జాతీయ రహదారిపై నిరసనలు చేపట్టారు. జిల్లాలో అంతర్గతపోనును పరిష్కరించలేక కాంగ్రెస్ అగ్రనేతలు తల పట్టుకునేలా అయింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీలో అసంతృప్త జ్వాలలు చెలరేగుతుండటంతో పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఇది కూడా చదవండి: విచారణకు రమ్మన్నారు.. సజ్జల అరెస్ట్ తప్పదా? సింగాపురం ఇందిర మద్దతుదారుల ఆగ్రహం.. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలకుతమకు సమాచారం ఇవ్వలేదని ఇందిర మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమం ఏదైనా కడియం వర్గీయులదే పైచేయి ఉంటుందని ధ్వజమెత్తుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు కూడా తమ మాట వినడం లేదని సీరియస్ అయ్యారు. స్టేషన్ ఘనపూర్ లో సింగపురం ఇందిరా కాంగ్రెస్ పార్టీనీ బ్రతికించిందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీలను రద్దు చేసి పాత కాంగ్రెస్ వారికి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కడియం శ్రీహరి టీడీపీ, బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు తాము ప్రతిపక్షంలో ఉన్నామని గుర్తు చేశారు. కాగా అధికారంలోకి ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న తమకు ప్రతిపక్షంలో ఉన్నట్లు ఉందని ఆవేదన చెందుతున్నారు. ఇది కూడా చదవండి: నేడు హర్యానాకు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇది కూడా చదవండి: రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్! #congress #warangal #kadiyam-srihari మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి