/rtv/media/media_files/2026/06/03/pawan-kalyan-2026-06-03-17-03-38.jpg)
తెలంగాణ రాజకీయాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. పవన్ వ్యాఖ్యలపై తెలంగాణకు చెందిన పలువురు నేతలు ఇప్పటికే మండిపడుతుండగా, తాజాగా ప్రజాగాయకుడు గద్దర్ కుమార్తె, కాంగ్రెస్ నాయకురాలు వెన్నెల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్‌కు నేరుగా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
రేపు మా బిడ్డల జాగీరు
తెలంగాణ గడ్డ నిన్న మా అయ్యల జాగీరే. ఈ ఉద్యమ గడ్డ ఈరోజు మా జాగీరు... రేపు మా బిడ్డల జాగీరు. దీనిపై మాట్లాడే హక్కు ఎవరికో లేదు అంటూ వెన్నెల చాలా ఘాటుగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం అనేది ఎవరో డబ్బులు పంచితేనో, లేదా ఢిల్లీలో లాబీయింగ్ చేస్తేనో ఊరికే రాలేదని వెన్నెల గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమం అనేది కోట్లాది మంది ప్రజల ఆత్మగౌరవ పోరాటమని స్పష్టం చేశారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారని, ఎందరో తల్లులు తమ కడుపు కోతను అనుభవించి బిడ్డలను కోల్పోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అన్నందుకే నాడు చాలా మందిని ఎన్‌కౌంటర్ చేశారని, ఇవన్నీ ఎన్నో త్యాగాల ఫలితాలని చెప్పారు. అంత పెద్ద ఉద్యమం జరిగినా తాము నాడు ఎవరినీ ఒక్క మాట కూడా అనలేదని వెన్నెల పేర్కొన్నారు.
తెలంగాణ గడ్డ నిన్న మా అయ్యల జాగీరే...
— Congress for Telangana (@Congress4TS) June 3, 2026
తెలంగాణ గడ్డ ఈరోజు మా జాగీరు...
రేపు మా బిడ్డల జాగీరు...
Gaddar's daughter Vennela condemns Pawan Kalyan's comments
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించిన గద్దర్ కూతురు వెన్నెల#Gaddar#PawanKalyan#Janasenapic.twitter.com/BNk0qKceuc
సినిమా నటుడిగా
పవన్ కల్యాణ్‌ను తెలంగాణ ప్రజలు కేవలం ఒక సినిమా నటుడిగా, అలాగే ఆయన గద్దర్ అభిమాని కాబట్టి ఆ కోణంలో మాత్రమే అభిమానిస్తారని.. అంతకుమించి ఇక్కడ రాజకీయంగా మాట్లాడితే ఒప్పుకునేది లేదన్నట్లుగా ఆమె తేల్చి చెప్పారు.
కాగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయం పూర్తిగా వేడెక్కింది. ఒకవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. పవన్‌కు మద్దతుగా నిలుస్తూ తెలంగాణ నేతల విమర్శలను తప్పుబడుతుండగా, మరోవైపు తెలంగాణ నుంచి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు పవన్‌పై ఎదురుదాడి తీవ్రం చేశారు.
Follow Us