/rtv/media/media_files/2025/02/22/VsSelw3IB1LDqCCwXYWj.jpg)
Free Chicken and Egg Mela Draws Massive Crowds in Hyderabad Amid Bird Flu Fears
చికెన్ ప్రియులు గత కొద్ది రోజులుగా నోటికి తాళం వేశారు. బర్డ్ ఫ్లూ భయంతో కనీసం కోడిని కాదు కదా.. కోడి గుడ్డును కూడా తినడం మానేశారు. అమ్మో చికెన్ తింటే ఏమవుతుందో ఏమో.. బర్డ్ ఫ్లూ వైరస్ మాకు కూడా వ్యాపిస్తుందేమో అనే అపోహలో కొంతమంది ఉన్నారు. అయితే ఈ విషయంపై నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు. అలాంటిదేమి జరగదని.. చికెన్, గుడ్లు తింటే ఏం కాదని చెబుతున్నారు.
Also Read: Trump-Musk:మస్క్ కుమారుడి అల్లరి వల్ల 145 సంవత్సరాల డెస్క్ మార్చేసిన ట్రంప్!
కానీ ప్రజల్లో మాత్రం ఎక్కడో తెలియని భయం. ఈ క్రమంలోనే చికెన్, గుడ్లు సేల్స్ బాగా పడిపోయాయి. దీంతో చికెన్ వ్యాపారులు బావురమంటున్నారు. పౌల్ట్రీ రైతుల పరిస్థితి అయోమయంలో పడింది. ఈ క్రమంలోనే పౌల్ట్రీ బ్రీడర్స్ కో-ఆర్డినేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. స్పెషల్‌గా చికెన్ మేళాలు ప్రారంభిస్తున్నారు.
Also Read: Punjab: 405 రోజులు... 10 దేశాలు... 41 లక్షల రూపాయలు.. చేరిన గమ్యం.. కానీ అంతలోనే!
చికెన్ మేళాలు
చికెన్ అండ్ గుండ్లు వండి మరీ ప్రజలకు ఫ్రీగా ఇస్తున్నారు. చికెన్‌తో రకరకాల వంటకాలు చేసి పంచిపెడుతున్నారు. ఉడకబెట్టిన చికెన్, గుడ్లతో ఎలాంటి ప్రమాదమూ లేదని చాటి చెబుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో స్పెషల్ చికెన్ మేళా నిర్వహించారు. ఫ్రీగా చికెన్, ఎగ్‌లను వండి ఫ్రీగా ప్రజలకు పంచిపెట్టారు. దీంతో నాన్ వెజ్ ప్రియులు పరుగులు పెట్టారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
హైదరాబాద్‌లో ఫ్రీ చికెన్ ఫ్రై.. క్యూ కట్టిన జనం
— Lokal App- Telugu (@LokalAppTelugu) February 21, 2025
ఉప్పల్ గణేశ్‌నగర్ వద్ద ఉచితంగా మెగా చికెన్ అండ్ ఎగ్ మేళా
ఫ్రీ చికెన్ ఫ్రై కోసం దాదాపుగా అర కిలోమీటర్ మేర క్యూ కట్టిన ప్రజలు
బర్డ్ ఫ్లూ భయమే లేకుండా చికెన్ ఫ్రై కోసం ఎగబడుతున్న జనం pic.twitter.com/UyCFZMTHbe
ఇలా దాదాపు 6 చోట్ల ఫ్రీ చికెన్, ఎగ్ మేళాలను నిర్వహించారు. ప్రతి చోట 2వేల కిలోల చికెన్, 2వేల గుడ్లతో ప్రజలకు పంపిణీ చేశారు. ఇక రాబోయే రోజుల్లో తెలంగాణ, ఏపీలోని మరో 250 ప్రాంతాల్లో ఇలాంటి మేళాలు నిర్వహించనున్నారు.
Also Read: Punjab: 405 రోజులు... 10 దేశాలు... 41 లక్షల రూపాయలు.. చేరిన గమ్యం.. కానీ అంతలోనే!