/rtv/media/media_files/2026/04/19/bapu-rao-2026-04-19-15-02-10.jpg)
Former Botha MLA Rathod Baburao has joined Telangana Jagruti.
BIG BREAKING: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు ఈ రోజు తెలంగాణ జాగృతిలో చేరారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.
తెలంగాణ జాగృతిలో చేరిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు గారు.
— Telangana Jagruthi (@TJagruthi) April 19, 2026
బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. pic.twitter.com/rIUqctcbGz
రెండు సార్లు ఎమ్మెల్యే
వృత్తిరీత్య ఉపాధ్యాయుడైన బాపురావు 2009లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2009 నుండి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర నాయకుడిగా పనిచేశాడు. 2014 లో తెలంగాలో జరిగిన తెలంగాణ తొలి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జాదవ్ అనిల్ కుమార్‌పై 26వేలకు పైగా ఓట్ల అధిక్యంతో విజయం సాధించారు. ఆ తర్వాత 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల లో టీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోయం బాబు రావు పై 6వేలకు పైగా ఓట్ల అధిక్యంతో విజయం సాధించారు. అయితే 2023లో నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనను కాదని అనిల్ జాదవ్‌ను అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించడంతో అసంతృప్తితో ఉన్న ఆయన అక్టోబర్ 18న భారత రాష్ట్ర సమితి పార్టీకి రాజీనామా చేశాడు. రాథోడ్ బాపూరావు నవంబర్ 01న ఢిల్లీలో కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరాడు .
బీజేపీ నుంచి కాంగ్రెస్
2023లో బీఆర్‌ఎస్ టికెట్ నిరాకరించడంతో బీజేపీలో చేరిన బాపురావు ఆ తర్వాత కొద్దికాలానికే ఏప్రిల్ 2024 లో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న బాపురావు ఈ రోజు తెలంగాణ జాగృతిలో చేరడం సంచలనంగా మారింది. బాపురావు బోథ్ నియోజకవర్గంలో గిరిజన సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. అలాంటి నాయకుడు జాగృతిలో చేరడం అటు కాంగ్రెస్‌కు, ఇటు బీఆర్‌ఎస్ కు కొంత నష్టమనే చెప్పాలి.
Follow Us