తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థులు ఫుడ్ పాయిజన్ బారిన పడుతున్న ఘటనలు వరుసగా బయటపడుతున్నాయి. ఈ విషయంపై హైకోర్టు ప్రభుత్వాన్ని మందలించింది కూడా. తాజాగా మంగళవారం డిసెంబర్ 3న నల్గొండ జిల్లాలో ఫుడ్ పాయిజన్ కారణంగా మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ లో అస్వస్థతకు గురైయ్యారు. దుగ్యాల మోడల్ స్కూల్ లో 7 గురు బాలికలు అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో ఐదుగురు బాలికలను రాత్రికి రాత్రే దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరు బాలికలు కడుపునొప్పితో చికిత్స తీసుకుంటున్నారు. మొత్తం ఏడుగురు విద్యార్థినీలు ఫుడ్ పాయిజన్ వల్ల ఎఫెక్ట్ అయ్యారు. Also Read: నాగచైతన్య హల్దీ ఫంక్షన్ లో అఖిల్ ఏం చేశాడో చూడండి.. ఫొటో వైరల్! మంగళవారం రాత్రి నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి హాస్పిటల్ కు వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను ఆమె ఆదేశించారు. ఫుడ్ పాయిజన్ లాంటిది ఏం జరగలేదని కలెక్టర్ చెప్పారు. గతమూడు రోజులుగా బాలికలు ఆహారం సరిగా తినడం లేదని అందువల్లనే నీరసం అయ్యారని అన్నారు. వారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వెల్లడించారు. Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది? బాలికలు మాత్రం వారు తిన్న ఆహారం కారణంగానే ఫుడ్ పాయిజన్ అయ్యిందని చెప్తున్నారు. మూడు రోజులుగా హాస్టల్ లో భోజనం సరిగా పెట్టడం లేదని, ఎస్వోకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాలికలు చెప్తున్నారు. విద్యార్థి సంఘాలు హాస్పిటల్ ముందు దర్నాకు దిగాయి. విద్యార్ధి సంఘాల నాయకులు ఆందోళన చేస్తున్నారు. Also Read: కేసీఆర్ పై కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తారా.. కేటీఆర్ Also Read: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..!