/rtv/media/media_files/2025/04/06/hl0Qjrjq1EiLxaS2FruF.jpg)
Nagarjuna Sagar
Nagarjuna Sagar : నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ డ్యాం పరిధిలో మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. నాగార్జునసాగర్ ప్రధాన ఎర్త్ డ్యాం వద్ద ఆదివారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పాయింట్ నుంచి శివుడి పార్క్ వరకు ఎర్త్ డ్యాం వెంట ఉన్న చెట్లు పూర్తిగా కాలిపోయాయి. సీసీ కెమెరాలు కొంత సామాగ్రి దగ్ధమయ్యాయి.ఈ రోజు మధ్నాహ్నం ఎర్త్ డ్యాం దగ్గర మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. అప్పటికే మంటలకు ఎర్త్ డ్యాం పై ఉన్న సీసీ కెమెరాలు, విద్యుత్ వైర్లు ధ్వంసం అయ్యాయి. డ్యాం దగ్గర ఇటీవల వరుసగా అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వేసవికాలం కావడం వల్ల డ్యాం పైన ఎండిపోయిన గడ్డి ఎక్కువగా ఉండడంతో వేడికి అంటుకుని మంటలు చెలరేగుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. అయితే కృష్ణ జలాల విషయంలో తెలంగాణ, ఆంధ్ర వివాదం నేపథ్యంలో కావాలనే ఎవరైనా ఇలా చేస్తున్నారా అనే అనుమానాలు లేకపోలేదు.
Also Read : దేశానికి స్ఫూర్తినిచ్చిన పోరాటం..ఆ భూములపై కేటీఆర్ బహిరంగ లేఖ
Also read : డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని
మార్చి 19న నాగార్జునసాగర్ ప్రధాన ఎర్త్ డ్యాం వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పాయింట్ నుంచి శివుడి పార్క్ వరకు ఎర్త్ డ్యాం వెంట ఉన్న చెట్లు పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫిబ్రవరి 15, 21 తేదీల్లో డీఫారెస్ట్ ఏరియాలో అగ్ని ప్రమాదం జరిగి చెట్లు, మొక్కలు కాలి బూడిదయ్యాయి. తాజాగా మరోసారి ప్రమాదం జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు తాజాగా మరోసారి ప్రమాదం జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ
ఇది కూడా చూడండి: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి