చీరకొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌లో మహిళ కాపీయింగ్.. ఎక్కడంటే?

తెలంగాణలో 563 గూప్-1 పోస్టులభర్తీకి సోమవారం మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించారు. నాలుగో రోజు ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఎగ్జామ్‌లో ఓ అభ్యర్థిని కాపీయింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగింది.

New Update
GROUP 1

చాలా మంది విద్యార్థులు పదోతరగతి, ఇంటర్, డిగ్రీలో పరీక్షలు రాసే సమయంలో చిట్టీలు తీసుకొచ్చి కాపీ కొడుతుంటారు. అలా పరీక్షల్లో కాపీ కొట్టే సమయంలో ఒక్కోసారి దొరికిపోతుంటారు. దీంతో వెంటనే ఇన్విజిలేటర్ వారిని పరీక్ష రాయకుండా డిబార్ చేయడం వంటివి మనం చూసే ఉంటాం. అయితే ఇప్పుడు కూడా అలాంటిదే జరిగింది. ఆ కాపీయింగ్ ఇంటర్, డిగ్రీలో కాదు.. గ్రూప్ 1 ఎగ్జామ్‌లో జరిగింది. 

ఇది కూడా చదవండి: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో ఏడుగురు షూటర్లు అరెస్టు..

563 గూప్-1 పోస్టుల భర్తీకి ఎగ్జామ్

రాష్ట్రంలో 563 గూప్-1 పోస్టుల భర్తీకి సోమవారం మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించారు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 46 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. ఈ మెయిన్స్ ఎగ్జామ్స్‌కి మొదటి రోజు మొత్తం 31,403 మందికి గానూ 22,750 మంది హాజరయ్యారు.

ఇది కూడా చదవండి: కాటేసిన కాళేశ్వరం.. కేసీఆర్‌కు బిగ్ షాక్!

ఈ ఎగ్జామ్స్ అక్టోబర్ 22 నుంచి అక్టోబర్ 27 వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగానే ఈ పరీక్షలు మొదలై మూడు రోజులు సజావుగా సాగిపోయాయి. కానీ నాలుగో రోజు మాత్రం అనుకోని సంఘటన జరిగింది. ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఎగ్జామ్ జరుగుతుండగా.. ఓ అభ్యర్థిని కాపీయింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. 

ఇది కూడా చదవండి: వైసీపీకి బిగ్ షాక్.. మూడు రోజులు కస్టడీకి తీసుకున్న సీఐడీ

అచ్చం స్కూల్, కాలేజీలో కాపీయింగ్ చేసినట్టుగా.. స్టేట్ లెవెల్ హయ్యర్ ఎగ్జామ్ అయిన గ్రూప్1లో కాపీయింగ్ చేసింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం మంగల్ పల్లిలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో గ్రూప్1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే 4వ రోజున కాపీయింగ్ చేస్తూ ఓ మహిళా అభ్యర్థిని అధికారులకు చిక్కింది. 

ఇది కూడా చదవండి: రూ.10 నాణేలు చెల్లుతాయి.. లావాదేవీలకు వాడొచ్చు

చీర కొంగులో చిట్టీలు

ఏకంగా చీర కొంగులో చిట్టీలు తీసుకొచ్చింది. ఇక కాపీయింగ్ చేస్తున్న క్రమంలో ఇన్విజిలేటర్ గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించగా.. కాపీయింగ్ చేసిన అభ్యర్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆ అభ్యర్థినిది మహబూబ్ నగర్ జిల్లా పెద్దమందాడి మండలం గట్ల ఖానాపూర్ గ్రామం అని తెలిసింది. అంతేకాకుండా ఆమె గవర్నమెంట్ ఉద్యోగిని అని సమాచారం. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి లభించింది. దీనికి సంబంధించి పర్మిషన్ పత్రాలను మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్, ఒడితల సతీష్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు వాసుదేవ రెడ్డి తీసుకున్నారు. 

New Update
ts

BRS

ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రజతోత్సవ సభకు పోలీసులు అనుమతులు ఇచ్చారు. వరంగల్ సీపీ ఆదేశాల మేరకు కాజీపేట రూరల్ ఏసీపీ ఉత్తర్వులు జారీచేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ సభలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు నిరాకరించడంతో, కోర్టుల ద్వారా అనుమతులు పొందడం జరిగింది. ఆ అనుభవం దృష్ట్యా, రజతోత్సవ సభ అనుమతుల కోసం బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈరోజు పోలీసులు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో, హైకోర్టులో వేసిన కేసును బీఆర్ఎస్ పార్టీ ఉపసంహరించుకోనుంది.

 

today-latest-news-in-telugu | brs-party | meeting | warangal 

 

Also Read: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ ఏం ఆడింది మామా..

Advertisment
Advertisment
Advertisment