/rtv/media/media_files/2025/02/28/08WJbahKoFmFdiM8xV0P.jpg)
Irrigation Officers
Irrigation Officers : నిజాం సాగర్ కెనాల్ నీటి విడుదలలో అధికారులు అనుచరిస్తున్న విధానాలను నిరసిస్తూ నీటిపారుదల శాఖ అధికారులు రైతులు నిర్భందించారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంతంలోని సాలూర మండలం సాలురా క్యాంప్ గ్రామంలో చోటు చేసుకున్నది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం
Also Read: హైక్లాస్ 5జీ స్మార్ట్‌ఫోన్.. ఫస్ట్ సేల్‌లో భారీ డిస్కౌంట్- డోంట్ మిస్!
నిజాంసాగర్ కెనాల్ నీరు విడుదల చేసి వారం రోజులు గడుస్తున్నప్పటీకి నీరు చివరి ఆయకట్టు వరకు అందడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో నిజాంసాగర్ డి 28 కెనాల్ లో నీళ్లు రావడం లేదని ఫిర్యాదు చేయడంతో ఇరిగేషన్ అధికారులు కెనాల్‌ను పరిశీలించడానికి శుక్రవారం గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో రైతులు ఆందోళనకు చేయడంతో పాటు వారితో వాగ్వివాదానికి దిగారు. నీరు దిగువకు రాకపోవడానికి అధికారుల నిర్లక్షమే కారణమనివారు ఆరోపించారు. అయితే అధికారులు పొంతనలేని సమాధానం చెప్పడంతో ఆగ్రహించిన రైతులు ఇరిగేషన్ అధికారులను గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి తాళం వేశారు. నిజాంసాగర్ కెనాల్ నీరు చివరి ఆయకట్టు వరకు అందకపోవడంతో పంటలు ఎండుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్న అధికారులు స్పందించడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
Also Read: పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్.. కోర్టు సంచలన తీర్పు.. ఇక జైల్లోనే!
ఇరిగేషన్ అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, వారిని నిర్భందించి పంచాయతీ కార్యాలయంలో తాళం వేశామని రైతులు చెప్పారు. విషయం తెలుసుకున్న బోధన్ రూరల్ సీఐ విజయబాబు, బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి, సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. అయితే రైతులు వారితో తమ గోడును వెల్లబోసుకున్నారు. చివరికి రైతులకు నచ్చజెప్పి అధికారును విడిపించి పంపించివేశారు. కాగా రైతుల ఆవేశం వెనుక పంటలు ఎండిపోతాయన్న ఆవేదన ఉందని. కానీ అధికారులను నిర్భందించడం వల్ల సమస్యలు పరిష్కారం కాదని పై అధికారులను కలిసి సమస్యలను పరిష్కరించుకోవాలని పోలీసులు కోరారు.
Also read: SLBC: మంత్రుల చేపల కూర విందు.. కేటీఆర్ సంచలన ట్వీట్!
Also read: కరీంనగర్‌లో పోలింగ్ సిబ్బంది బస్సుకు ప్రమాదం.. 20 మందికి గాయాలు