suicide attempt : ప్రముఖ సింగర్‌ కల్పన ఆత్మహత్యాయత్నం

ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేశారు. ఆమెను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్సపొందుతున్నారు కల్పన. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించిన కల్పన హైదరాబాద్ లోని నిజాంపేటలో నివాసం ఉంటున్నారు. నిద్రమాత్రలు మింగి కల్పన ఆత్మహత్యయత్నం చేశారు.

New Update
kalpana suicide attempt

kalpana suicide attempt

suicide attempt : ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేశారు. ఆమెను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్సపొందుతున్నారు కల్పన. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించిన కల్పన హైదరాబాద్ లోని నిజాంపేటలో నివాసం ఉంటున్నారు. నిద్రమాత్రలు మింగి కల్పన ఆత్మహత్యయత్నం చేశారు. నిజాంపేట వర్టె్క్స్ ఫ్రీ విలేజ్‌లో ఉంటున్న కల్పన దంపతులు, రెండు రోజులుగా కల్పన తలుపులు తీయక పోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించారు.. కాగా ఆమె ఆత్మహత్యాయత్నంకు కారణం తెలియాల్సి ఉంది. కేవలం సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‏గా, నటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు సింగర్ కల్పన.

Also Read: అసెంబ్లీలో గుట్కా నమిలి ఉమ్మిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్

తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న అత్యంత పాపులర్ సింగర్‏లలో కల్పన ఒకరు. మధురమైన గాత్రంతో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి శ్రోతలను మైమరపించింది. మెలోడి సాంగ్స్‏తోపాటు రాగాలపనమైన పాటలను అనేకం పాడారు. ఏఆర్ రెహమాన్, ఇళయారాజా, ఎస్పీ బాలు, కేవీ మహదేవన్, చిత్ర వంటి ప్రముఖ గాయనీగాయకులతో కలిసి అనేక పాటలు ఆలపించారు.

lso Read :  తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇలా!

గతంలోనూ కల్పన ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 27 ఏళ్లుగా పాటలు పాడుతూనే ఉన్నాను. కానీ 2010లో విడాకులు అయ్యాయి. అప్పటికే ముగ్గురు పిల్లలున్నారు. వారిని చదివించాలి. కానీ ఉద్యోగం లేదు. పాటలు పాడేందుకు ఒక్క అవకాశం కూడా రాలేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితులలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కానీ ఆ సమయంలో సింగర్ చిత్రమ్మ నాకు ధైర్యం చెప్పింది. నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి పుట్టావా ? అంటూ నాకు ధైర్యం చెప్పి.. జీవితంలో ముందుకు వెళ్లేందుకు ప్రోత్సహించింది అని తెలిపారు కల్పన.

కల్పనా భర్తతో విడిపోయి సింగిల్ గా ఉంటున్నారు కల్పన. ఆమె భర్త ప్రసాద్ చెన్నైలో ఉంటున్నారు. కాగా ఆయనను పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. రెండు రోజులుగా డోర్ తీయకపోవడంతో ప్రసాద్ కు ఫోన్ చేసిన స్థానికులు. దాంతో ఈరోజు మధ్యాహ్నం చెన్నై నుంచి వచ్చాడు కల్పనా భర్త ప్రసాద్. ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు కల్పన.  ఒంటరితనం, మానసిక,ఆరోగ్య సమస్యలే ఆమె ఆత్మహత్యయత్నానికి కారణమని తెలుస్తోంది.

 

Also Read: 'మీరు పెంచితే మేము పెంచుతాం'.. అమెరికాకు చైనా షాక్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు