/rtv/media/media_files/2026/03/17/kavitha-2026-03-17-20-05-46.jpg)
Telangana Jagruti kavitha
Telangana Jagruti : వెలుగు మట్ల బాధితులందరికీ న్యాయం జరగడం కోసం నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అందరికీ న్యాయం జరిగేలా పోరాటం చేసేందుకు కమిటీ దోహద పడుతుందన్న ఆమె రిటైర్డ్ జడ్జి, ఆర్మీ మాజీ మేయర్, ప్రొఫెసర్లు, లాయర్లు, సామాజిక వేత్తలు, జర్నలిస్టులతో కమిటీ వేయనున్నట్లు వెల్లడించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఈ కమిటీ ప్రభుత్వం వెంటబడుతుందన్నారు. ప్రొఫెసర్ కోదండరాం, హరగోపాల్, ఆకునూరి మురళి లాంటి వాళ్లు ఈ విషయంలో స్పందించాలని కవిత డిమాండ్ చేశారు.పేదలకు న్యాయం చేసేందుకు ఇదే సరైన సమయం అన్న ఆమె వెలుగుమట్లలో ప్రభుత్వం ఎంత కర్కషంగా వ్యవహరించిందో అక్కడకు వెళ్లి పరిశీలించాలని, ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చి పేదవారికి న్యాయం జరిగేలా చేయండని కోరారు.
అలాగే కమిటీకి ప్రభుత్వం, ప్రభుత్వాధికారులు సంపూర్ణంగా సహకరించాలని కోరుతున్నానన్నారు. బాధితుల ఇళ్లు పూర్తయ్యే వరకు వాళ్ల మనుగడకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. కమిటీ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా దారుణంగా వెలుగుమట్లలో ఎటువంటి నోటీసులు, హెచ్చరిక లేకుండా పేదల750 ఇళ్లను కూల్చేశారన్నారు. ధర్మసమాజ్ పార్టీ, జాగృతి ఈ అన్యాయం పై చేసిన పోరాటంతో ప్రభుత్వం దిగివచ్చింది కూల్చిన చోటే 350 మందికి పట్టాలు ఇస్తామని మరో 110 మందికి వాళ్ల గ్రామాల్లో ఇళ్లు కట్టుకునేందుకు డబ్బులు ఇస్తామని ప్రకటించిందన్నారు. ప్రభుత్వం స్పందించిన తీరును బట్టి ప్రజాస్వామ్యంలో ప్రజాపోరాటాలకు గెలుపు ఉంటుందని భావిస్తున్నాం .అయితే 750 మంది ఇళ్లను కూల్చేసి, 460 మందికి మాత్రమే ఇళ్లను ఇస్తామంటున్నారని, ఇంకా చాలా మందికి న్యాయం జరగలేదన్నది స్పష్టంగా తెలుస్తోందన్నారు. బాధితులందరికీ న్యాయం జరగాలన్న ఉద్దేశంతో విశారదన్ నిన్న కూడా ఖమ్మం వెళ్తే ఆయనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదన్నారు.
ఈ ప్రభుత్వం ఏమాత్రం పారదర్శకత లేకుండా ఉంది. ప్రభుత్వం బాధ్యతయుతంగా మెలిగేలా ఎలా చేయాలన్న దానిపై మేము చర్చించాం. రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ తో పాటు సమాజం కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న చాలా మందితో మాట్లాడం. రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, ఆర్మీ మాజీ మేజర్ మదన్ మొహన్, ప్రొఫెసర్లు అనురాధ, నాగం కుమార స్వామి, రామయ్యలతో పాటు లాయర్లు సుంకర నరేష్, శ్రావణ్ గౌడ్, నూర్జన్, జర్నలిస్టులు తెలంగాణ విఠల్, ఆకాశ్ గౌడ్, క్రాంతి లాంటి వాళ్లు ఒక కమిటీ గా ఏర్పడ్డారన్నారు. పేద వాళ్లకు న్యాయం చేసేందుకు వాళ్లు ఉద్యోగాలు చేస్తూనే సమాజం కోసం పోరాటం చేసేందుకు ముందుకు వచ్చారన్నారు.వాళ్లందరి కమిట్ మెంట్ ను ప్రశంసిస్తున్నా. ప్రభుత్వం, అధికారులు ఈ కమిటీకి సహకరించాలని కోరారు. జాగృతి, ధర్మ సమాజ్ పార్టీ ప్రజాపోరాటాలకు ప్రభుత్వం దిగివచ్చింది. కానీ సంపూర్ణ న్యాయం జరగలేదు.డిసెంబర్ 9 నాటికి వాళ్ల ఇళ్లను పూర్తి చేస్తామని చెబుతున్నారు. కానీ అప్పటి వరకు ఆ పేదలు ఎక్కడ ఉండాలి వాళ్ల ఇంటి అద్దె, పిల్లల చదువుకు కావాల్సిన సాయం ప్రభుత్వమే చేయాలి. ఇప్పుడు ఏర్పడిన కమిటీ ద్వారా బాధితులకు న్యాయం జరిగే విధంగా అన్ని విధాలుగా పోరాటం చేస్తాం అదే విధంగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న మేధావులు కూడా ఈ విషయంలో స్పందించాలని కోరారు. మేధావుల మౌనం సమాజానికి ఎంతో నష్టం చేస్తుంది. అందరూ స్పందించాలని కల్వకుంట్ల కవిత కోరారు. అదే విధంగా ఈ కమిటీ ఒక న్యూట్రల్ కమిటీ కనుక వారికి ప్రభుత్వం సహకరించాలన్నారు.
Follow Us