/rtv/media/media_files/2026/02/13/fotojet-9-2026-02-13-21-49-07.jpg)
kothagudem corporation
Municipal Elections : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కొత్తగూడెం కార్పొరేషన్ ఫలితం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఏ సర్వేలకు అందని విధంగా అక్కడ సీపీఐ అధికస్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ ప్రభంజనాన్ని అడ్డుకుంటూ సీపీఐ తన పట్టు నిలుపుకోవడంతో రెండు పార్టీలు చెరో 22 స్థానాల్లో విజయం సాధించాయి. దీంతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఇరు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఈ క్రమంలో సీపీఐకి మద్దతు ఇస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది.
కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో 60 డివిజన్లు ఉండగా సీపీఐ(cpi) 22 వార్డులను గెలుచుకుంది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీకి 22, బీఆర్ఎస్(brs) పార్టీకి 8, సీపీఎం 1, బీజేపీ 1, స్వతంత్రులు 6 స్థానాల్లో విజయం సాధించారు. అయితే కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే మేజిక్ ఫిగర్ 31 కాగా.. సీపీఐ పార్టీకి మరో 9మంది కార్పొరేటర్ల మద్దతు అవసరం కానుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సీపీఐ పార్టీకి ఏ పార్టీ మద్దతు తెలుపుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే బీఆర్ఎస్ నేత కేటీఆర్ సీపీఐకి మద్దతు ఇస్తామని ప్రకటించారు. దీంతో సీపీఐ సంఖ్య 30 కి చేరుతుంది. మరో కమ్యూనిస్టు పార్టీ సీపీఎం ఒక స్థానంలో గెలవడంతో ఆ పార్టీ ఎలాగు సీపీఐకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో మేయర్ పీఠం సీపీఐకి దక్కనుంది. ఒకవేళ సీపీఐ కాంగ్రెస్ తో జతకడితే ఇతర పార్టీల మద్దతు లేకుండానే మేయర్ పీఠం దక్కించుకోగలదు. అయితే సింగరేణి విషయంలో కాంగ్రెస్ తో విభేదిస్తున్న సీపీఐ కాంగ్రెస్ ను కాదనుకుంటే బీఆర్ఎస్, సీపీఎం, ఇండిపెండెంట్ల మద్దతుతో మేయర్ పీఠాన్ని సొంతం చేసుకోగలదు.
ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐకి పొత్తు కుదరకపోవడంతో ఇరుపార్టీలు ఎవరికి వారుగానే పోటీ చేశారు. అయితే మేయర్ పీఠం దక్కించుకోవడం కోసం రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే సీపీఐ కాంగ్రెస్ తో పోతుందా లేదా అనేది తేలాల్సి ఉందిజ. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు చర్చనీయంశంగా మారింది. కొత్తగూడెంలో సీపీఐ. కాంగ్రెస్ ది ప్రెండ్లీ పోటీనే అని తేల్చి చెప్పారు. దీన్ని బట్టి కాంగ్రెస్ సీపీఐకి మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎవరికి వారు మాత్రం తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఈక్రమంలోనే ఇక్కడ 8 బీఆర్ఎస్ సభ్యులు కీలకంగా మారారు. దీంతో ఒక బీఆర్ఎస్ సభ్యుడు కిడ్నాప్ కావడం సంచలనంగా మారింది. ఆయనను కాంగ్రెస్ వారు కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగడం సంచలనంగా మారింది. ఆయా పార్టీలు తమ సభ్యులను క్యాంపులకు తరలించడంతో 16 వరకు ఉత్కంఠ కొనసాగనుంది.
Follow Us